Others

కుంగ్‌ఫు బామ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెల్లవారక ముందే లేవడం ఆమెకు ఇష్టం...
94 ఏళ్ల వయసులోనూ లేచిన వెంటనే గ్రామం చుట్టూ పరిగెట్టి రావడం మహాఇష్టం...ఎవరైనా అల్లరిచిల్లరగా ప్రవర్తిస్తూంటే
మెత్తగా మొట్టికాయవేయడం మరీ ఇష్టం.
ఎప్పుడూ ఉల్లాసంగా... ఉత్సాహంగా ఉండే ఆమె అంటే ఆ గ్రామంలో అందరికీ చాలాఇష్టం... ఇప్పుడు ఆమె సామాజిక మాధ్యమాలకు అనుకోని వరం. ఆమె గురించి కథనాలకు విశేష ఆదరణ లభిస్తూండటమే అందుకు కారణం.
**
చైనాలోని ఝేజియాంగ్ ప్రావిన్స్‌లోని నిన్‌ఘాయ్ కౌంటీకి చెందిన ఈ 94 ఏళ్ల బామ్మ పేరు ఝంగ్ హెక్జియాన్. కానీ ఆ పేరు చాలామందికి తెలీదు. కానీ 3కుంగ్ ఫు గ్రాండ్‌మా2గా ప్రపంచం అంతటా అమె తెలుసు. నాలుగేళ్ల వయసులో తండ్రి నేర్పిన కుంగ్‌ఫు ఆమెకు ఇష్టమైన వ్యాపకం. నేర్చుకోవడం.. నేర్పించడం ఆమె దినచర్య. అయినవారికైనా, ఇతరులకైనా ఇష్టం ఉంటే నేర్పించడానికి ఎప్పుడూ సిద్ధపడే బామ్మ ఒక్కరోజుకూడా అస్వస్థతకు గురికాలేదు. తెల్లవారే తండ్రిలేపి కుంగ్‌ఫూలో ఆమెకు శిక్షణ ఇచ్చేవారు. బయటకు వెళ్లే వీలు లేకపోతే మంచంపైనా శిక్షణ కొనసాగేది. చైనాలో నిత్యం ఘర్షణలు, యుద్ధాలు జరుగుతూండటంతో ఆత్మరక్షణకోసం ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేవారు. అలా తండ్రి ఆమెకు కుంగ్‌ఫూ నేర్పించారు. ఆ అలవాటు కొనసాగిస్తూనే ఉన్న బామ్మ అంటే గ్రామంలో వారికి గౌరవం. ఓసారి భార్యను హింసిస్తున్న భర్తను చూసిన బామ్మ కర్ర తీసుకుని కుంగ్‌ఫూ ఆధారంగా కొట్టిపడేసింది. ఇక మొబైల్స్ గేమ్స్‌లో మునిగిపోయేవారిని చూస్తే చిర్రెత్తుకొచ్చి వారికి కుంగ్‌ఫూలోని మెలకువలు నేర్పుతూంటుంది. అల్లరి చేసేవారికి ఆమె అంటే హడల్. ఎంత గడుగ్గాయిలైనా ఆమెను చూస్తే గప్‌చిప్. కొడుకు, మునిమనుమలు ఇప్పుడు ఆమె దగ్గర కుంగ్‌ఫూ పాఠాలు నేర్చుకుంటున్నారు. దగ్గరి బంధువులంతా జీవనోపాధికోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిపోవడం ఆమెకు నిరాశకలిగిస్తోంది. అయితే అలాగని ఆమె ఖాళీగా ఉండటం లేదు. ఇరుగుపొరుగువారికి, ఔత్సాహికులకు స్వయంగా శిక్షణ ఇస్తోంది. 300 ఏళ్లుగా సంప్రదాయంగా వస్తున్న కళను తమ కుటుంబం ఎలా విస్మరిస్తుందన్నది ఆమె ప్రశ్న. అందుకే పదిమందికీ ఈ విద్య నేర్పిస్తున్నానంటోంది. రెండేళ్ల క్రితం ఈ బామ్మ సంగతి బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఇక అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పత్రికలు, టీవీ ఛానెళ్లు ఆమెముందు వాలిపోయాయి. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు ఆమె కథనాలను హోరెత్తిస్తున్నాయి. శాఖాహారం, చక్కనైన వ్యాయామం, ప్రశాంతమైన మనసు తన ఆరోగ్య రహస్యాలని ఆమె చెబుతోంది.