Others

తాతమ్మ కల తీరింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటికి కాళ్లు జాపుకుని కూ ర్చున్న ‘ఆనీ’ అనే ముత్తమామ్మగారికి 99 నిండాయి. నూరో ఏట అడుగుపెట్టింది. నెదర్‌ల్యాండ్స్‌లో అంతా రుూమెను ‘డచ్‌గ్రానీ’ అనే పిలుస్తారు. మునిమనుమలకి ముత్తవ్వంటే ఎంతో యిష్టం. ఐతే ముసలమ్మగారికి ‘తీరని కోరిక ఏమేనా వున్నాయా?’ అంటూ అడిగారు వాళ్లు.
‘‘మా అమ్మనే అడిగారు. థాంక్స్’’ అంటూ మురిసిపోయింది ఆ ముదుసలి. ‘‘జైల్లో పెట్టించండర్రా! నన్ను. ఒక్కసారంటే ఒక్కసారి’’ అంటూ
బ్రతిమాలింది. వాళ్లంతా అవాక్కయిపోయారు.
‘‘నిజమా?’’ అన్నారు. ఔనర్రా! జైలుకెళ్లాలని నాకు కోరిక, ఏనాటినుంచో వుంది. అది నెరవేరిందో. నిశ్చింతగా వెళ్లిపోతానర్రా!’’ అంటున్న తాతమ్మ కలను తీర్చాలనే అనుకున్నది ఆమె మేనగోడలు. తెలిసిన ఒక పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. చెప్పింది సంగతి. పోలీసులు వచ్చి తాతమ్మను అరెస్టు చేశారు. చేతులు యిచ్చింది. ఛస్తారా? ‘‘సరే తాతమ్మా!’’ అన్నారు. తాతమ్మకి బేడీలు తగిలించి చక్రాల కుర్చీతో సహా సెల్‌లోకి జాగ్రత్తగా త్రోసేశారు.
‘‘అమ్మయ్య! కోరిక తీరింది, ఫొటోలు తియ్యండి, ఫేస్‌బుక్‌లో పెట్టుకోండి’’ అంటూ మారాం చేసింది సీనియర్ మోస్ట్ సిటిజనమ్మ. బేడీల చేతులతోనే దీవించింది ఆ తాతమ్మ. ఇంకానయం- శిలువ వేయండి అనడగలేదు అనుకుని సంతోషించారు.