Others

వాట్సాప్ హంగామా మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. మెసేజ్ పంపడం.. షేర్ చేసుకోవడమే. ప్రస్తుతం వాట్సాప్ హంగామా ఇదీ.. సాంకేతిక విప్లవం పరుగులు తీస్తున్న నేపథ్యంలో వాట్సాప్ వినియోగం ఎక్కువైంది. చేతిలో సెల్‌ఫోన్ పట్టుకుని చిటికెలో అద్భుత దృశ్యాలను, కీలక సమాచారాన్ని, చక్కటి సందేశాలను, ఆకట్టుకునే వీడియోలను షేర్ చేసుకుంటూ ఇలా అనేక రకాలుగా యువత వాట్సాప్‌కు హ్యాట్సాప్ చెబుతున్నారు.
స్మార్ట్ ఫోన్ వినియోగంలో ఇప్పుడు వాట్సాప్ వాడకం ఎంతో కీలకంగా మారింది. ఏదైనా సమాచారం ఉంటే క్షణాల్లో మిత్రులకు పంపడం, అక్కడినుంచి దీన్ని షేర్ చేసుకోవడం నిమిషాల వ్యవధిలో జరిగి పోతోంది. దీన్ని వినియోగించుకుని లబ్ధిపొందుతున్న వారు ఎంతో మంది ఉన్నారు.
పండుగలు, ఇతర పర్వదినాలు, ఇతర ప్రత్యేక దినాల్లో శుభాకాంక్షలకు వాట్సాఫ్‌ను వినియోగిస్తున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ సర్వీసుల వివరాలు, జనన ధ్రువీకరణ పత్రాలను, డ్రైవింగ్ లైసెన్సు, వివాహ ధ్రువీకరణ పత్రాలు, పాన్‌కార్డులు, పాస్‌పోర్టు దరఖాస్తులు ఇలా అనేక సేవలకు ఎలా దర ఖాస్తు చేసుకోవా లన్నది వాట్సప్‌లో మిత్రులకు చేర వేస్తున్నారు.
ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలు, ప్రజా సేవలను అం దించే వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పోలీ సు శాఖకు ఎంతో ఉపయోగ కరంగా ఉంటుంది. అనేక శాఖల ఉన్నతాధికారులు దిగువ స్థాయి అధికారులను గ్రూప్‌గా వాట్సాప్‌లో ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంపుతున్నారు. చేపట్టాల్సిన పనులను ప్రతిరోజు తెలియ జేస్తున్నారు. ఇలా అనేకమంది దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు.
సెల్ఫీగా..
కళ్ళముందు అనేక దృశ్యాలు, చిత్రాలు కనిపి స్తుంటా యి. కొన్ని చిత్రాలు కనిపించేవే, కాని కొన్ని అరుదైనవి. ఇలాంటి వాటిని గతంలో మిస్ అయ్యే వాళ్ళం. ఇప్పుడా పరిస్థితి లేదు. చేతిలో స్మార్ట్ఫోన్ ఉండడంతో క్లిక్‌మనిపించి తమ స్నేహితులకు వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్ బుక్ ద్వారా అప్‌లోడ్ చేస్తున్నారు.
గతంలో అయితే ‘ఏరా ఎక్కడున్నావ్.. చాలా రోజులైంది.. ఎక్కడా కనిపిం చడంలేదు’ అని మిత్రుడిని సహచరులు అడిగేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రైలెక్కినా, బస్సెక్కినా, విమాన మెక్కినా సెల్‌ఫోన్‌లో ఓ సెల్ఫీ తీసుకుని వెంటనే మిత్రులకు పోస్ట్ చేసేస్తున్నారు. ఇలా సాంకేతికతను యువత వినియోగిం చుకుంటోంది.
జాగ్రత్తలు తప్పనిసరి
వాట్సాప్, ఫేస్‌బుక్ ఏదైనా వినియోగించే టప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. అనేక మంది వాట్సాప్‌లో అశ్లీల దృశ్యాలు, ఇతర అభ్యంతరకర అంశాలు పంపుతుంటారు. ఇలాంటివాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

-నీలిమ సబ్బిశెట్టి