Others

కాపురం కలర్‌ఫుల్ కావాలంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పెళ్లి అంటే నూరేళ్లపంట’’ అనేది పాత నానుడి. ‘పెళ్ళంటే మూన్నాళ్ల ముచ్చట’ అని ఆధునిక యువతి అంటుంది. గత దశాబ్దకాలంలో మన దేశంలో విడిపోయే జంటల సంఖ్య నానాటికి పెరిగిపోతున్నది. విడాకులు తీసుకొనే జంటలు పెరిగిపోవడానికి ప్రధాన కార ణం వయోభేదం ప్రధాన కాఠణం అంటే ఆశ్చర్య పోవల్సిందే. వయోభేదం ఎంత ఉంటే బాగుంటుంది అన్న దానిపై దశాబ్దాలకాలంగా చర్చనీయాంశంగా ఉంది. మన దేశంలో అయితే, వరుడు వధువుకన్నా వయస్సులో పెద్దగా ఉండాలంటారు. పాశ్చాత్య దేశాలలో అయితే వయస్సుకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వరు. అయితే వధూవరులమధ్య వయోభేదం సంవత్సరం కనుక ఉంటే, వారి దాంపత్యం అన్యోన్యంగా సాగుతుందని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో. అమెరికాలోని ఎమోరి విశ్వవిద్యాయలంకు చెందిన వారు దంపతులమధ్య వయోభేదం, వారి దాంపత్య జీవితం అనే అంశంపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో దంపతుల మధ్య వయోభేదం ఎంత తక్కువ ఉంటే వారి దాంపత్య జీవితం అంత అనురాగమయంగా సాగుతున్నట్లు గుర్తించారు. ఈ సర్వేను 3 వేల జంటలపై నిర్వహించారు. భార్యాభర్తలమధ్య వయోభేదం సంవత్సరం ఉన్న జంటలలో విడాకుల శాతం కేవలం మూడు మాత్రమే. వయోభేదం ఐదు సంవత్సరాలు ఉన్న జంటలు 18 శాతం, వయోభేదం పది సంవత్సరాలు ఉన్న జంటలు 39 శాతం, వయోభేదం 20 సంవత్సరాలు ఉన్న జంటలు 95 శాతం విడాకులు తీసుకొంటున్నారు. దీనినిబట్టి అవివాహితులారా, వివాహం చేసుకొనే సమయంలో వయోభేదం పట్ల కూడా కొంత శ్రద్ధ చూపి, మీ వివాహ జీవితాలను కలర్‌ఫుల్‌గా మార్చుకోండి.

-పి.్భర్గవరామ్