Others

‘చావు’కీ శివుని ఆజ్ఞ కావాలి! - వార్త-వ్యాఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు. అటువంటిది శివుని ఆజ్ఞ లేనిదే యమకింకరులు రాగలరా? డాక్టర్ల మాట రోగి వింటాడు. కాని ఒక్కసారి మృత్యుదేవత వినదు. సంపన్నుడైన ‘‘బర్మింగ్‌హామ్’’ బిల్డింగ్ కాంట్రాక్టరు రాన్ ఆడమ్స్‌గారు కాస్త ‘‘చెస్టు’’ నొప్పి, దగ్గు వస్తోందని డాక్టరుని కలిశాడు- షరామామూలే పరీక్షలు- ఎక్సరేలు- వగైరాలు- ‘‘అయ్యా’’ మీకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి వున్నదండీ!’’ అన్నారు. అరవై ఎనిమిది వసంతాలు చూసిన సంప న్న బిల్డరు. మహాఅయితే మూడు నెలలు అంతకన్నా నీకు భూమిమీద నూకలు లేవు సారీ!’’అన్నారు వైద్య మహాశయులు. అతనికి భార్య షీలా, యిద్దరు కుమారులు వున్నారు. వాళ్ళు ‘‘డీలా’’ పడిపోయారు.
రాన్ ఆడమ్స్ (84) నవ్వుతూ పత్రికల వారికి రుూ సంగతి చెపుతూ ‘‘నిజంగా టపాకట్టేస్తాననుకున్నానండీ’’అన్నాడు. ఇక 90 రోజులే. ఏంచెయ్యాలి. ఏభై వేల పౌండ్ల క్యాష్ వుంది. ఖర్చు పెట్టేయాలి. భార్య షీలాకి (62) కారు ‘‘డ్రయిన్‌వే’’కూడా కొనేశాడు. ‘‘ఇంత నోట్లకట్ట తెచ్చి అబ్బాయ్ వుంచరా! పండుగ చేసుకో అన్నాడు. రాన్ ఆడమ్స్‌కి కార్ల మోజు వుంది. నేరుగా షాపుకి వెళ్ళాడు. అతి విలువగల, చాలా ఖరీదైన మెర్సిడెస్ సి.ఎల్.కె. కారు నొకదాన్ని ఎంచుకుని యిరవై వేల పౌండ్ల నగదు అక్కడ బల్లమీద పడేశాడు. అలాగే ‘‘కామారో’’ 1968 మాడల్ కారు దాకా ఎన్నో కార్లుకొన్నాడు. డబ్బు బీరులాగా కూడా కాదు. కేవలం మంచి నీళ్ళలాగా ఖర్చుపెట్టేయడం మొదలుపెట్టాడు. 2002 అక్టోబర్‌లో వెల్‌కమ్ మై డెత్ అంటూ రెడిగా జాలీగా ఎంజోయ్ చేయడం మొదలుపెట్టాడు.
అయితే రేడియోతెరపీ మాత్రం కొనసాగించాడు. భార్య షీలాకోసం స్వర్గతుల్యమైన బాత్‌రూమ్ నిర్మించాడు. కాకపోతే తను పోయాక ఖర్చులకీ గట్రా ఒక ఐదువేల పౌండ్లు మాత్రం భద్రపరిచాడు. కాని చిత్రంగా నొప్పిలేదూ, దగ్గూ లేదు. హాయిగా మందు మాత్రలు, దగ్గు సిరప్ కూడా తీసుకొని పోకుండా స్పెయిన్ దేశం టూర్ చేశాడు. డాక్టర్లు మరణశిక్ష వేశారు గాని పదిహేనేళ్లయింది. అది అమలుకాలేదు. సంతోషంగా వుంది నాకు. డాక్టర్ల దెబ్బతో ‘‘వర్రీ’’ అన్నది నా దరిచేరకుండా పారిపోయింది అంటున్నాడు ‘‘టిప్‌టాప్’’గా తయారై కారెక్కుతూ..అంచేత కనపడుతున్న వైద్యుల్నికాక కనపడకపోయినా దేముడ్ని నమ్మండి. రంగేళి రాజాలాగా పైకం ఖర్చుపెట్టి సుఖపడండి!-

-వీరాజీ veeraji.pkm@gmail.com