Others

వ్యాయామం ఎలా చేయాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్యం బాగుండాలని వ్యాయామం చేస్తుంటాం. దీర్ఘకాలికంగా ఆరోగ్యం మనచేతుల్లో పదిలంగా ఉండాలంటే ప్రతిరోజూ ఉదయం వేళ ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే మేల ని తాజా అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన బాత్ యూనివర్శిటీ అధ్యాపకులు డైలాన్ ధామ్సన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆహారం తీసుకుని వ్యాయామం చేయటం వల్ల కొవ్వుకణజాలంలో మార్పులు సంభవించినట్లు వీరి పరిశోధనల్లో వెల్లడైంది. వ్యాయామానికి ముందు ఆహారం తీసుకున్న, తీసుకోనివారి రక్తనమూనాలు సేకరించి పరిశోధనలు చేశారు. అల్పాహారం తిన్న రెండు గంటల తరువాత 60 నిమిషాలు నడిచిన మగవారిలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆక్సిజన్‌ను స్వీకరించే విషయంలో నూ, కొవ్వు కణజాలం స్పందించే సందర్భాలు వేర్వేరుగా ఉన్నట్లు గమనించారు. కాబట్టి ఆహారం తీసుకోకుండా వ్యా యామం చేయటం వల్ల బరువు తగ్గటానికి ఆస్కారం ఉంది.