Others

నరుడు .. నారాయణుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం గుడికి వెళ్లాలనుకొనేటపుడు దారిలోఎవరైనా ముసలినో, ముతకనో, లేక ఆరోగ్యం బాగలేకనో ఏ ఆపదవల్లనో సొమ్మసిల్లిపోవడం మనకంట పడితే మనం పవిత్రంగా భావించిదేవునికి తీసుకొని పోయే నీరునో, లేక ప్రసాదాన్నో, లేక కొబ్బరినీళ్లనో వారికి అందిస్తే అది భగవంతునికి నేరుగా చేరినట్టే అవుతుంది. దేవుని హుండీలో వేయాలనుకొన్న సొమ్మును నిరుపేదలైన వారికి లేక ఆపద సమయంలో ఉన్నవారికి అందచేసినా అది కూడా దేవునికి చెందినట్టే అవుతుంది. దీనికి కారణం దేవుడు ప్రతి మానవుడిలోను ఉన్నాడు. కనుక మానవుల్లో తరతమభేదాలను, హెచ్చుతగ్గులను లెక్కించడమంటే దేవుని లెక్కించినట్లే అవుతుంది. ఎవరికీ చీమంత ఉపకారం కూడా చేయక, ఉపకారం వాంఛించేవారిని అసహ్యించుకుంటూ జీవితం గడిపి దేవుడికి దగ్గరకి వెళ్లి ఎన్ని కానుకలు సమర్పించినా అది వ్యర్థమే అవుతాయ. తోటి మానవుల్లో పరమాత్మను చూచి వారికి కావలసిన సాయాన్ని అందిస్తే ఆ సాయానే్న భగవంతుడు తనకిష్టమైన నివేదనగా స్వీకరిస్తాడు. ఆయన అనుగ్రహమూ లభింపచేస్తాడు.మన ఎదుటనే పరమాత్మ మనకు సాక్షాత్కరిస్తాడు.