Others

మద్యం మత్తు మగువలకు మంచిది కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురుషులు స్ర్తిల కంటే ఎక్కువ మద్యం ఎందుకు తాగగలుతున్నారు అనే రహస్యాన్ని అమెరికన్ శాస్తవ్రేత్తలు ఇప్పుడు ఛేదించగలిగినట్టే భావిస్తున్నారు. ఆల్కహాల్ సేవించిన పురుషులకంటే దానిని త్రాగిన స్ర్తిలు మరింత త్వరగా ‘మైకం’లో పడతారని, ఆల్కహాల్‌ని పుచ్చుకోవడం వల్ల మగవాళ్ళ కంటే ఆడవాళ్లకి కాలేయం దెబ్బతినడం అధికంగా జరుగుతుందని పలువురు పరిశోధకులు పేర్కొన్నారు.
అయితే ఈ వ్యత్యాసానికి మూల కారణం కడుపులో వుంటుందని కూడా వారు తెలిపారు. ఆల్కహాల్ శరీరంలోని రక్తప్రవాహంలో కలిసిపోయేలోగానే దాని దాని ప్రభావాన్ని తగ్గించి వేసే రక్షణ ‘ఎంజైము’ స్ర్తిలలో కంటే పురుషుల కడుపులో బాగా ఎక్కువగా తయారవుతుందని, దానివల్ల ఒకే పరిమాణంలో ఆల్కహాల్‌ని సేవించిన స్ర్తి పురుషులలో పురుషులకు తక్కువ మైకం కలుగుతుందని శాస్తజ్ఞ్రులు వివరించారు.
ఈ కారణంగా ఏదైనా పార్టీలో మద్యం సేవించమని వచ్చినపుడు లేదా మద్యం తీసుకున్న తర్వాత వాహనాలను నడపడం లేదా యంత్ర పరికరాలను ఉపయోగించడం లాంటి పనులు చేయవలసిన సందర్భాలలో స్ర్తిలు పురుషులకంటే ఎక్కువ జాగ్రత్తగా వుండాలని న్యూయార్కులోని బ్యాంక్స్, వెటరన్స్, అఫయిర్స్ మెడికల్ సెంటర్‌కి చెందిన ఆల్కహాల్ రీసెర్చి అండ్ ట్రీట్‌మెంట్ సెంటర్‌వారు చెప్పారు.

- బి.మాన్‌సింగ్ నాయక్