Others

నాకు నచ్చిన చిత్రం-- శతమానంభవతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నవారిని పల్లెలు ఎలా చూస్తాయో దర్శకుడు ‘శతమానంభవతి’ చిత్రంలో అద్భుతంగా చిత్రీకరించాడు. జానకమ్మగా జయసుధ పడే ఆరాటం మర్చిపోలేని విధంగా ఉంటుంది. తండ్రిగా ప్రకాష్‌రాజ్ పాత్ర ద్వారా ‘ఎదురుగా పళ్లెంలో అన్నీ పెట్టుకుని చూస్తే కడుపు నిండదురా’ అని పలికే డైలాగు, వారసులకు చెంప ఛెళ్ళుమనిపిస్తుంది. బావామరదళ్ళుగా శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ నటన మన ఇంటి పక్క మనుషుల్లా చేశారనిపిస్తుంది. నరేష్ పోషించిన బంగార్రాజు పాత్ర వినోదంతో ఆకట్టుకుంటుంది. శతమానంభవతి అన్నపాటలో నటీనటుల హావభావాలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా జయసుధ పోషించిన అమ్మ పాత్ర ప్రతీ ఇంట్లోనూ కనబడుతుంది. పిల్లలకోసం ఎదురుచూపులు, వారు వచ్చిన తరువాత ఇష్టమైనవి వండిపెట్టడం, వారు తింటుంటే ఆనందంగా కళ్లు చెమ్మగిల్లడం లాంటి మనసుకు పట్టేసే అంశాలన్నీ చిత్రంలో చూపించారు. అందుకే చిత్రానికి జాతీయ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు లభించింది. ప్రతీ తల్లిదండ్రులతోపాటుగా వారి పిల్లలు ఈ చిత్రాన్ని చూస్తే నేటి సంబంధ బాంధవ్యాలు ఎలా వున్నాయో తెలుస్తుంది. బంధం విలువ తెలుస్తుంది.

-కె శ్రీనివాస్, బెల్లంపల్లి