Others

ఈ బుడతడు... తప్పు చెప్పడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండున్నరేళ్లకే అద్భుత ప్రతిభ
అమెరికాలో ‘స్పెల్‌బీ’ పోటీల్లో విజేత
నెల్లూరి చిన్నోడి రికార్డు

ఓ రోజు ఆకాష్ ఒకటిన్నర వయసులో ఉండగా మేనమామ ఏదో తినిపిస్తూ ‘స్పూన్’ అన్న ఆంగ్ల పదం గురించి చెప్పాడు. ఆ పదాన్ని స్పష్టంగా
పలికిస్తూ స్పెల్లింగ్ కూడా చెప్పాడు. మరుసటి రోజు యథాలాపంగా అడిగితే ఆకాష్ స్పెల్లింగ్‌తో సహా పొల్లుపోకుండా చెప్పాడు. అది జరిగిన తరువాత ఆకాష్ ఫ్రిజ్‌పై అక్షరాల వర్ణమాలను వరుస క్రమంలో ఉంచటం చూసిన
తల్లిదండ్రులు అతని ప్రతిభను గుర్తించి స్పెల్లింగ్స్‌లో శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. ఇలా తల్లిదండ్రులు, మేనమామ ప్రోత్సాహంతో పసి వయసు నుంచే స్పష్టంగా పదాలు పలకటం, వాటి స్పెల్లింగ్ చెప్పటంలో ప్రతిభ
కనబరచాడు.

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. ఆకాష్ అనే ఈ రెండున్నరేళ్ల బుడతడి విషయంలో ఇది నిజమైంది. ఈ వయసులో మాటలే సరిగా రావు. అలాంటిది ఆ మాట స్పెల్లింగ్‌ను అక్షరం పొల్లుపోకుండా చెబుతాడు. నిద్రలో లేపి అడిగినా తడుముకోకుండా చెబుతాడు. నోరు తిరగని ఏ పదం స్పెల్లింగ్ అడిగినా ఠకీమని చెప్పేస్తాడు. ఇప్పటి వరకు ఇంత చిన్న వయసులో ఇలా తప్పుల్లేకుండా స్పెల్లింగ్ చెబుతున్న ఈ చిన్నారి అసాధారణ ప్రతిభకు అమెరికాలోని స్టీవ్ హెర్వీస్ హిట్ టివీ షో నిర్వాహకులు సైతం అచ్చెరువొందారు. చిన్నారుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించే ఈ స్పెల్లింగ్ బీ షోకు విపరీతమైన ప్రజాదరణ ఉంది. నీట్‌గా తలదువ్వుకుని, ధైర్యంగా కనిపిస్తూ కఠినమైన పదాలకు తడుముకోకుండా స్పెల్లింగ్ చెబుతున్న ఆకాష్‌ను చూసి వీక్షకులు ముచ్చటపడ్డారు. ఈ షో జరుగుతున్న సమయంలో రెండుసార్లు డైపర్ మార్చాల్సిన వయసులో ఉన్న ఆకాష్ ఎటువంటి అసౌకర్యాన్ని వ్యక్తం చేయకుండా సమాధానాలు చెప్పడం విశేషం.
నెల్లూరు నుంచి..
రెండున్నరేళ్ల ఈ బుడతడు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందినవాడు. తండ్రి కృష్ణ వైద్యుడు. తల్లి చంద్రకళ. వృత్తిరీత్యా అమెరికా వెళ్లిన ఈ కుటుంబంలో ఆకాష్‌కు ఇంత జ్ఞాపకశక్తి ఎలా అబ్బిందంటే తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహమే అని చెప్పవచ్చు.
స్పూన్ అనే పదంతో ఆరంభం
ఓ రోజు ఆకాష్ ఒకటిన్నర వయసులో ఉండగా మేనమామ ఏదో తినిపిస్తూ ‘స్పూన్’ అన్న ఆంగ్ల పదం గురించి చెప్పాడు. ఆ పదాన్ని స్పష్టంగా పలికిస్తూ స్పెల్లింగ్ కూడా చెప్పాడు. మరుసటి రోజు యథాలాపంగా అడిగితే ఆకాష్ స్పెల్లింగ్‌తో సహా పొల్లుపోకుండా చెప్పాడు. అది జరిగిన తరువాత ఆకాష్ ఫ్రిజ్‌పై అక్షరాల వర్ణమాలను వరుస క్రమంలో ఉంచటం చూసిన తల్లిదండ్రులు అతని ప్రతిభను గుర్తించి స్పెల్లింగ్స్‌లో శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. ఇలా తల్లిదండ్రులు, మేనమామ ప్రోత్సాహంతో పసి వయసు నుంచే స్పష్టంగా పదాలు పలకటం, వాటి స్పెల్లింగ్ చెప్పటంలో ప్రతిభ కనబరచాడు. దీంతో తల్లిదండ్రులు ఆకాష్‌తో పాటు అమృతను మెన్సాలో చేర్పించారు. ఇక్కడ అతి చిన్న వయసులో ఉన్న చిన్నారులు వీరే కావటం విశేషం. పిల్లలకు ఇంటిలోనే తల్లి విద్యాబోధన, శిక్షణ, లాలనలో ఆకాష్ రాటుదేలాడు. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెల్లింగ్ బీ షోలో తన ప్రతిభను కనబరచాడు.
చిన్న వయసులో విజేతగా..
ఇప్పటి వరకు స్పెల్లింగ్ బీ కాంపిటీషన్‌లో ఇంత చిన్న వయసులో ప్రతిభ చూపినవాడు ఆకాష్ ఒక్కడే. గత ఏడాది ఏడేళ్ల చిన్నారి ఈ పోటీలో గెలుపొందాడు. ఈసారి ఆకాష్ విజేతగా నిలవటం విశేషం. రెండున్నరేళ్ల వయసు తమ కొడుకువల్ల నేడు అమెరికాలో తమ గుర్తింపు రావటం ఆనందంగా ఉందని ఆకాష్ తల్లిదండ్రులు చెబుతున్నారు. రోజుకు ఓ గంట మాత్రమే స్పెల్లింగ్ ప్రాక్టీసు చేస్తాడు. కాని ఒక్కసారి చెబితే చాలు మళ్లీ చెప్పాల్సిన అవసరం లేకుండా తిరిగి చెప్పేస్తాడు. ముద్దు ముద్దుగా ఆకాష్ చెప్పే సమాధానాలు నిర్వాహకులను సైతం ఆకట్టుకున్నాయి.