AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్ 33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకో ప్రశ్న

రాముడి తర్వాతి
తమ్ముడు ఎవరు?

రాముడు వెళ్లాక దశరథుడు వశిష్ఠుడ్ని పిలిచి చెప్పాడు.
‘మహామునీ! మీరు వెళ్లి రాముడు, సీతల చేత చేయాల్సిన వ్రతాన్ని చేయించండి’
వెంటనే వశిష్ఠుడు రథ మీద రాముడి ఇంటికి చేరుకుని, రథం మీదే రెండు వాకిళ్లని దాటాడు. బైటికి వచ్చిన రాముడు ఆయన చేతిని పట్టుకుని రథం మీంచి గౌరవ పూర్వకంగా దింపాడు. రాముడ్ని కుశల ప్రశ్నలు వేశాక వశిష్ఠుడు చెప్పాడు.
‘రామా! నీ తాత నీ తండ్రికి చేయించినట్లుగా నీ తండ్రి నీకు రేపు ఉదయం రాజ్యాభిషేకం చేయబోతున్నాడు. కాబట్టి మంత్రపూర్వకంగా మీ దంపతుల చేత ఉపవాస వ్రతాన్ని చేయించడానికి వచ్చాను’
ఆయన అది చేయించి వెళ్లాక రాముడు కొద్దిసేపు ముచ్చటించి తర్వాత తన అంతఃపురంలోకి వెళ్లాడు.
రాముడి ఇంటి నించి వెళ్తున్న వశిష్ఠుడు దారులన్నీ గుమిగూడిన జనంతో ఇరుకవడం, వీధులన్నీ తుచి, నీళ్లు చల్లి, చెట్ల పంక్తులని ఏర్పరిచి, ఇళ్లపైన జెండాలని ఎగరేయడం గమనించాడు. అయోధ్యా పౌరులు ఆ మహోత్సవాన్ని చూడటానికి సూర్యోదయం ఎప్పుడు అవుతుందా అని వేచి ఉన్నారు. వారి మాటలు సముద్రపు ఘోషలా వినిపించాయి. రథాన్ని చూసిన వారు రెండు పాయలుగా పక్కకి తప్పుకోగా ఆయన రాజప్రాసాదాన్ని చేరుకుని సభలోకి వెళ్లాడు. దశరథుడు సింహాసనాన్ని దిగగానే గౌరవ పూర్వకంగా సభలోని మిగిలిన వారు కూడా లేచారు. వశిష్ఠుడు దశరథుడితో చెప్పాడు.
‘మీరు చెప్పిన పనిని పూర్తి చేసి వచ్చాను’
అలంకరించుకున్న స్ర్తిలతో దేవేంద్ర భవనం లాంటి తన అంతఃపురంలోకి దశరథుడు వెళ్లాడు.
వశిష్ఠుడు వెళ్లాక రాముడు స్నానం చేసి సీతతో కూర్చుని శ్రీమన్నారాయణుడ్ని ధ్యానిస్తూ హవిస్సు పాత్రని తలమీద ఉంచుకుని తన శ్రేయస్సుకి విష్ణువుకి అగ్నిలో ఆజ్యాన్ని హోమం చేశాడు. మిగిలిన హవిస్సుని తిని వౌనంగా సీతతో కలిసి దర్భల మీద పడుకున్నాడు. తెల్లవారు ఝామున లేచి ఇంటికి అలంకరణని చేయించాడు. తర్వాత ప్రాతఃకాల సంధ్యని వార్చి మనసులో గాయత్రీ జపాన్ని చేసి తల వంచి మహావిష్ణువుకి నమస్కరించాడు.
తెల్లటి పట్టుబట్టలు ధరించిన బ్రాహ్మణుల పుణ్యావచనం ధ్వని అయోధ్య అంతా వినిపించసాగింది. అది విని సీతారాములు ఉపవాసం ఉన్నారని తెలుసుకుని పౌరులంతా సంతోషించారు. వారు తమ నగరాన్ని అలంకరించసాగారు. దేవాలయాల మీద, అక్కడి వృక్షాల మీద, నాలుగు వీధులు కలిసే చోట, వీధుల్లోను, కోట బురుజుల మీద, దుకాణాల్లో, తమ ఇళ్ల మీద, అన్ని సభా భవనాల మీద, చెట్ల మీద, అందరికీ కనపడే చోట జండాలని ఎగరేయసాగారు. అక్కడక్కడా నటీనటులు అభినయించసాగారు. కొందరు నాట్యం చేయసాగారు. గాయకులు పాటలు పాడసాగారు. మనసుకి, చెవులకి ఆనందం కలిగే మాటలు అన్ని చోట్లా వినపడసాగాయి.
ఆ ముహూర్తం సమీపిస్తూండగా వారంతా ఇళ్లల్లో, వీధుల్లో ఒకరితో మరొకరు అదే విషయాన్ని మాట్లాడుకోసాగారు. ఆఖరికి ముంగిళ్లల్లో ఆడుకునే పిల్లలు కూడా ఆ విషయమే మాట్లాడుకోసాగారు. పువ్వులు చల్లి, సుగంధ ధూపాలు వేసి రాజమార్గాన్ని అందంగా చేశారు. రాజ్యాభిషేక కార్యక్రమం పూర్తయ్యేసరికి చీకటి పడచ్చని వీధుల్లో వృక్షాకారంలో దీపాలని వెలిగించారు.
‘తను వృద్ధుడు అయ్యాడని గ్రహించిన దశరథుడు గొప్ప మనసుతో రాముడికి రాజ్యాభిషేకం చేస్తున్నాడు. రాముడు రాజైతే మనందర్నీ రక్షిస్తాడు. గర్వం లేని వాడు, పండితుడు ఐన రాముడికి తన సోదరుల మీద ఎంత ప్రేమ ఉందో మన మీద కూడా అంతే ప్రేమ ఉంది. దశరథుడు చిరకాలం జీవించుగాక’ అని వారు చెప్పుకోసాగారు.
ఆ కార్యక్రమం చూడటానికి గ్రామాల నించి కూడా తరలి వచ్చిన జనాలతో అయోధ్య నిండిపోయింది. (అయోధ్యకాండ - సర్గ 5,6)
హరిదాసు ఆ రోజుకి ఆ కథ పూర్తి చేసి రామలక్ష్మణులకి, హనుమంతుడికి హారతి ఇచ్చాక కొందరు శ్రోతలు ఆయన చెప్పిన కథలోని కొన్ని తప్పులని ఎత్తి చూపారు. ఆ ఏడుగురు శ్రోతలు చెప్పిన ఆ తప్పులని మీరు కనుక్కోగలిగారా?

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

అయోధ్య కాండలో మొత్తం
ఎన్ని సర్గలు ఉన్నాయి?
-54

కిందటి వారం ప్రశ్నలకు జవాబులు

1.రాముడ్ని తీసుకురమ్మని దశరథుడు సుమంత్రుడ్ని పంపాడు తప్ప మంత్రులని కాదు.
2.రవి, కుజులతో పాటు రాహువు కూడా ఆక్రమించాడు.
3.రాజుకి గొప్ప ఆపదతోపాటు మరణాన్ని కూడా సూచిస్తాయని దశరథుడు పేర్కొన్నాడని చెప్పడం హరిదాసు
విస్మరించాడు.
4.‘్భరతుడు దూరంగా ఉండగానే నీకు పట్ట్భాషేకం జరగాలి’ అని కూడా దశరథుడు చెప్పాడని హరిదాసు చెప్పలేదు.
5.దశరథుడి వద్ద నించి రాముడు సరాసరి కౌసల్యా మందిరానికి వెళ్లలేదు. ముందు తన ఇంటికి వెళ్లి, అక్కడ నించి తల్లి దగ్గరికి వెళ్లాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి