Others

అద్భుత విన్యాసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యోగాలో ఇది అద్భుతమైన విన్యాసం. ఎవ్వరు చేయని ఈ అద్భుతాన్ని 13 ఏళ్ల మైసూరు బాలిక కుషీ చేసి రికార్డుల్లోకి ఎక్కింది. యోగాసనాలలో అరుదైన ‘నిరాలంబ పూర్ణ చక్రాసనం’ ఒక్క నిమిషంలో పదిహేనుసార్లు వేసి ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఇంతవరకు ఈ ఆసనాన్ని నిమిషంలో ఇన్నిసార్లు ఎవ్వరూ వేయలేకపోయారు. శరీరాన్ని విల్లులా వెనక్కి వంచే ఈ ఆసనం అతికొద్ది మంది మాత్రమే వేయగలరు. అలాంటిది ఈ ఆసనాన్ని నిమిషంలో పదిహేనుసార్లు వేసి మన భారతీయ యోగాకు అంతర్జాతీయ ఖ్యాతిని కుషీ తీసుకువచ్చింది. వాస్తవానికి కుషీ శ్వాసకోశ సం బంధ ఆరోగ్య సమస్యతో బాధపడుతుంది. ఈ ఆరోగ్య సమస్య నుంచి తన కుమార్తెను రక్షించుకునేందుకు ఆయన యోగా గురు వు వద్దకు తీసుకువెళ్లారు. ఆ గురువు శిక్షణలో అద్భుత విన్యాసాలను సునాయాసంగా వేయటమే కాదు ఇపుడు ఆమెకు ఎలాం టి ఆరోగ్య సమస్యలు లేవు. ఈ ‘నిరాలంబ పూర్ణచక్రాసనం’ మాత్రం ఆమె ఎంతో మక్కువగా నేర్చుకుంది. గతంలో ఈ ఆసనా న్ని ఈ చిన్నారి 13సార్లు మాత్రమే వేయగలిగింది. ఈ సారి పదిహేనుసార్లు వేసి రికార్డు నెలకొల్పింది. ఆరోగ్య సమస్యను అధిగమించేందుకు యోగా నేర్చుకోవటం ఆరంభించిన ఈ బాలిక నేడు అంతర్జాతీయ రికార్డును నమోదు చేయగలిగిందంటే తండ్రి ఇచ్చిన ప్రోత్సహమే అని చెప్పవచ్చు. కుషీ తండ్రి రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు.