Others

టీనేజర్లకు స్కిప్పింగ్ మంచిదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లెల్లో వయసొచ్చిన పిల్లలు స్కిప్పింగ్ చేస్తే పెద్దవాళ్లు ఊరుకోరు. ముఖ్యంగా రుతుస్రావం సమయంలో ఈ ఆటను ఆసలు ఆడనివ్వరు. కేవలం చిన్న పిల్లలు మాత్రమే ఆడుకుంటారు. కాని స్కిప్పింగ్ అనేది అన్ని వయసుల వారికి మంచిదే. వయసులో ఉన్న ఆడపిల్లలు స్కిప్పింగ్ చేస్తే గర్భాశయ సమస్యలు తలెత్తుతాయనే ఆపోహ ఉంది. కాని ఇది నిజం కాదంటున్నారు వైద్య నిపుణులు. ఆడపిల్లలను వయసుతో నిమిత్తం లేకుండా చక్కగా పరుగెత్తటం, గెంతటం, స్కిప్పింగ్ చేయనివ్వండని సలహా ఇస్తున్నారు. కటిలోపల కండరాల బలహీనత వల్ల గర్భాశయం భ్రంశం జరుగుతుంది. అలాగే సాధారణ ప్రసవం సందర్భంగా ఈ సమస్య ఉత్పన్నం కావచ్చు. అంతేకాని వయసులో ఉన్న ఆడపిల్లలు తాడు ఆట ఆడటం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తవని చెబుతున్నారు. పైగా ఈ ఆట వారికి శారీరక బలాన్ని అందిస్తుందంటున్నారు. ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
అధిక బరువుతో బాధపడేవారు ఎక్కువ సేపు వ్యాయామం చేయలేరు. ముఖ్యంగా ఉద్యోగినులలో ఈ సమస్య అధికంగా ఉంది. ఇటువంటి వారు ఉదయం ఇరవై నిమిషాలు సేపు హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ శిక్షణ తీసుకుంటే చాలు. ఇది రెండు నెల లు చేస్తే సరిపోతుంది. క్రమపద్ధతిలో ఆహారం తీసుకోవటంతో పాటు ఈ వ్యాయామం చేస్తే చాలు నెలకు కనీసం ఐదు కిలోల బరువు తగ్గిపోతారు.
అరవై ఏళ్ల వయసుదాటిన వారు ట్రెడ్మిల్‌పై నడవటానికి భయపడుతుంటారు. ఇలాంటివారు వాకింగ్‌ను ఇష్టపడతారు. కాని రోడ్డుపై నడిచేకన్నా ట్రెడ్మిల్‌పై నడిస్తే మంచిదట. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య ఉండదు. అంతేకాదు కాలుష్యం బారిన పడరు. పైగా ట్రెడ్మిల్‌పై వ్యాయామం వల్ల హృదయ స్పందన రేటు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు.