AADIVAVRAM - Others

తలంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసుంటే మార్గం వుంది అంటారు పెద్దలు. ఏదైనా పనిని కచ్చితంగా చేద్దామని అనుకుంటే ఆ పనిని కచ్చితంగా చేస్తాం. మన మనస్సు ఆ దిశగా పనిచేస్తుంది. తలంపు శక్తి (విల్ పవర్) అని అంటాం. ఈ శక్తి ఏర్పరచుకోవాలంటే మన మనస్సులో ఆ పని కచ్చితంగా చేద్దామని వుండాలి. అది కచ్చితంగా వుంటే ఈ పనులన్నీ మనం చేస్తాం.
* మన మార్గంలో వచ్చే ఆటంకాలని మనం తొలగించుకుంటూ ప్రయాణం చేస్తాం.
* అందరూ ఏదైనా పనిని చేయకుండా వదిలిపెట్టినా మీరు ఆ పనిని కొనసాగిస్తారు.
* ఆ పనిని చేసే క్రమంలో ఎదురయ్యే సమస్యలకి పరిష్కారాలను కనుగొంటారు.
* ఏమీ లేదని అనుకున్నప్పుడు కూడా బలాన్ని కూడగట్టుకుంటారు.
* ఆ పనిని చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఆ పనే మీ మనస్సులో అనుక్షణం మెదులుతుంది.
* ఆ పని చేయడంలో మీరు ఎలాంటి నెపాలని ఎవరి మీద మోపారు.
* మీ అడుగు ముందుకు వేయడానికి అవసరమైన అన్ని వనరులని మీరు సమకూర్చుకుంటారు.
* మీ ప్రయాణంలో వ్యక్తులు మీ వెంట రావడానికి వాళ్లని మీరు ప్రోత్సహిస్తారు.
* మీకన్నా శక్తివంతులని కూడా మీరు అధిగమిస్తారు.
* మీకన్నా తెలివిగల వాళ్లకన్నా మీరు ముందుంటారు. ఎందుకంటే మీరు ఆ పనిని కచ్చితంగా చేద్దామని అనుకుంటారు. వాళ్లు ఆ విధంగా అనుకోవడం లేదు.
* వేగం తగ్గినప్పటికీ మీరు మీ పనిని సాధించే దిశగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు.

- జింబో 94404 83001