Others

కొండల్లో కోనల్లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే వర్షాకాలమే మంచిది. కొండలను ముద్దాడే మేఘాలు, పొగమంచు కప్పుకున్న పచ్చదనం, నీటి తుంపర్లు.. ఇలా ఒకటేమిటి ప్రకృతిని తనివితీరా చూస్తూ ఈ కాలంలో కుర్రకారు ట్రెక్కింగ్‌కి సిద్ధమవుతుంటారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పూచే పూలతో పుడమి తాజా అందాలను సంతరించుకుంటుంది. పక్షులను, జంతువులను పలకరించుకుంటూ ముందుకు సాగిపోవచ్చు. అందుకే ట్రెక్కింగ్ ప్రియులు ఈ కాలానే్న తమ సాహసయాత్రకు అనువుగా ఎంచుకుంటారు. ట్రెక్కింగ్ స్పాట్‌లో ప్రయాణించేటపుడు తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అపుడే ట్రెక్కింగ్ చిరస్మరణీయమైన అనుభవంగా మిగిలిపోతుంది. అవేమిటో తెలుసుకుందాం.

ట్రెక్కింగ్ చేసేటపుడు తేలికపాటి బూట్లు ఎంచుకోవటం మంచిది. వర్షాకాలానికి అనుగుణంగా జారిపోకుండా సౌకర్యవంతంగానూ, నాణ్యమైనవిగా ఉండేవి ధరించండి. ట్రెక్కింగ్ చేసే సమయంలో కాళ్లు ఉబ్బుతాయి. ఈ సందర్భంలో అడుగుల ఒత్తిడిని భరించే మన్నికైన బూట్లు కొనుగోలు చేయండి. పాదాలపై పడే ఒత్తిడిని నివారించుకోవచ్చు. చిన్న బెణుకులు సంభవించినా ట్రెక్కింగ్ చేయటం పెద్ద సవాల్‌గా మారుతుంది. వర్షాకాలంలో వేసుకునే నాణ్యమైన, సౌకర్యవంతమైన బూట్లు ధరించండి.
లైట్‌వెయిట్ ఉన్న వాటర్‌ప్రూఫ్ బ్యాక్‌ప్యాక్ ట్రెక్కింగ్‌కు చక్కగా ఉపకరిస్తుంది. ఈ బ్యాగ్‌లో రెయిన్‌కోట్ తప్పనిసరి. తడి,పొడి బట్టలను వేరుచేసుకునేందుకు వీలుగా సంచులు ఏర్పాటు చేసుకోండి.
సన్‌గ్లాసెస్‌ను వెంట తీసుకువెళ్లండి. వాస్తవానికి వర్షాకాలంలో వీటి అవసరం ఉండకపోవచ్చు. కాని ఎత్తయిన ప్రదేశాలకు వెళుతున్నారు కాబట్టి సూర్య కాంతి దగ్గరైనట్లుగా.. కళ్లమీద తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో తలనొప్పి, ఒణుకు వంటి వస్తాయి. వీటిని రాకుండా సన్‌గ్లాసెస్ కాపాడతాయి.
మీ బ్యాగ్‌లో ఒక జత తేలికపాటి చెప్పులను కూడా వెంట తీసుకువెళ్లండి. ట్రెక్కింగ్ సమయంలో శిబిరాల్లో ఉండాల్సి వస్తుంది. ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లినపుడు పాదాలకు గాలి తగలాలన్నా తేలికపాటి చెప్పులు ధరిస్తే హాయిగా ఉంటుంది. వాటర్‌ప్రూఫ్ చెప్పులను తీసుకువెళ్లండి.
వర్షాకాలంలో ఫంగస్ విపరీతంగా వ్యాపిస్తుంది. దీంతో ఇన్‌ఫెక్షన్ల బారినపడతారు. తేమ వాతావరణం కాబట్టి బాక్టీరియా కూడా విజృంభిస్తుంది. కాబట్టి ఇన్‌ఫెక్షన్లు సోకకుండా క్రీములు తీసుకువెళితే మంచిది.
ఉప్పు చేసే మేలు అంతాఇంతాకాదు. నీటిలో ఉప్పు, నిమ్మకాయ రసాన్ని కలుపుకుని తాగితే వ్యాధినిరోధక శక్తివలే పనిచేస్తుంది.