Others

వేశ్య పాత్రలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాల్లో మామూలు హీరోయిన్ల నుంచి టాప్ హీరోయిన్ల వరకు వేశ్య పాత్రలు వేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కారణం -ఆ పాత్రతో అన్ని రసాలు పండించే అవకాశం రావడమే కాకుండా ప్రేక్షకుల్లో మంచి సింపతీ దొరుకుతుంది. తాజాగా అలాంటి పాత్రలో నటించేందుకు మాజీ హీరోయిన్ సదా ఓకే చెప్పిందట. నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జయం’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింన సదా, తరువాత క్రేజీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ భాషల్లో వెలిగిన సదాకు, కొత్త తారల రాకతో అవకాశాలు బాగా తగ్గాయి. దాంతో ఐటెం సాంగ్స్ చేస్తూనే అటు టీవీ షోలూ చేసింది. తాజాగా తమిళంలో రూపొందే టార్చిలైట్ చిత్రంలో వేశ్యపాత్రలో నటించేందుకు ఓకే చెప్పిందట. ఈ పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందని, ఈ సినిమాతో కెరీర్ మళ్లీ ఊపందుకోవడం ఖాయమన్న నమ్మకంతో ఉంది సదా.