Others

ప్రొడక్షన్‌పైనా ఆసక్తి ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-నాగేశ్వరరెడ్డి

‘సీమశాస్ర్తీ’, ‘సీమటపాకాయ్’, ‘దేనికైనా రెడీ’ వంటి చిత్రాలతో తెలుగు
ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు నాగేశ్వరరెడ్డి. లేటెస్ట్‌గా ‘ఈడో రకం.. ఆడో రకం’ సినిమాతో తన మార్కు నిలబెట్టుకున్నాడు. ప్రొడక్షన్ పైనా ఆసక్తి ఉందంటున్న నాగేశ్వరరెడ్డితో చిట్‌చాట్..

హిట్ కొట్టినట్టున్నారు?
-అవును.. మంచి రెస్పాన్స్ దక్కింది. నేను ఏ సినిమా చేసినా అందులో సందేశాన్ని చెప్పాలనుకుంటాను. ఈ జనరేషన్‌లో పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిలు సెపరేట్‌గా ఉండాలనుకుంటున్నారు. దానిపై బేస్ చేసుకుని చేసిన సినిమా ఇది.
హిట్స్ పడుతున్నా
రేంజ్ పెరగడం లేదు?
-నాకు నచ్చిన కథలతో సినిమాలు చేస్తా. అంతేకాని క్రేజ్‌కోసం పాకులాడటం నాకు రాదు. క్రేజీ ప్రాజెక్ట్స్ వచ్చినా చేస్తా.
స్టార్ హీరోలతో ఎప్పుడు?
-సినిమాలు చేస్తామని నాగార్జున, వెంకటేష్, గోపీచంద్, రవితేజ వంటి స్టార్స్ అడిగారు. కాని కొన్ని కమిట్మెంట్స్ వలన కుదరలేదు. భవిష్యత్తులో కచ్చితంగా చేస్తా.
ఎంటర్‌టైన్‌మెంట్‌నే నమ్మారా?
- జనాలు సినిమాకు రావాలంటే ఆలోచిస్తున్నారు. బాగుందన్న టాక్ వినిపిస్తే తప్ప బయటికి రావడం లేదు. పైగా కోరుకునేది ఎంటర్‌టైన్‌మెంటేగా. అందుకే అదే దారిలో..
ప్రొడక్షన్ కూడా చేస్తున్నారు కదా?
-అవును. నాకు ప్రొడక్షన్ అంటే ఆసక్తి. కాని ఎందుకో ఆ రంగంలో సక్సెస్ కాలేకపోతున్నా.. కచ్చితంగా భవిష్యత్తులో మాత్రం హిట్ సినిమాలు నిర్మించాలనేది నా టార్గెట్.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..
-సుశాంత్‌తో ‘ఆటాడుకుందాం రా..’ చేస్తున్నాను. జూన్ మొదటి వారంలో సినిమా రిలీజ్ అవుతోంది. అలానే నరేష్ హీరోగా.. భోగవల్లి ప్రసాద్‌గారి నిర్మాణంలో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నా.

-శ్రీ