Others

చిత్రకేతువే వృత్రాసురుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నపిల్లవాడు చెప్పినదంతా విన్న చిత్రకేతువులో వ్యామోహం వీడింది. నశ్వరమైన దాన్ని వదిలిపెట్టేసాడు. శాశ్వితమూ, నిత్యమూ , సత్యమూ యైన నారాయణుని గూర్చి తెలుపమని నారద మహర్షిని వేడుకున్నాడు. నారదుడు చిత్రకేతువుకు నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రోచ్చారణ తో చిత్రకేతువు ఆనందించాడు. ఏడు రాత్రుళ్లు ఏడు పగళ్లుసమాధినిష్ఠుడై హరిధ్యానం చేశాడు. చిత్రకేతువుకు నారాయణ ధ్యానంతో విద్యాధర చక్రవర్తిత్వమూ, దివ్యవిమానమూ లభ్యమైనాయి. ఆ దివ్యవిమానమెక్కి ముల్లోకాలు దర్శిస్తూ తిరుగుతూ నారాయణ మంత్రాన్ని సదా జపించేవాడు.
అట్లాంటి చిత్రకేతువు ఓ సారి కైలాస పర్వతానికి వెళ్లి అక్కడ ముక్కంటి సభలో ప్రవేశించాడు. బ్రహ్మాది దేవతలు ఆసీనులై ఉన్నారు. దేవతలంతా ఈశ్వర సభలో ఆనందిస్తున్నారు. పార్వతీ దేవిని ఆలింగనం చేసుకొని పరమశివుడు సభలో కొలువుతీరి ఉండడం చిత్రకేతువు చూచి నవ్వాడు.
చిత్రకేతువు నవ్వును పరమేశ్వరుడు చిరునవ్వుతో చూచాడు. పార్వతీ దేవి ఇంతమంది ఉన్న సభలో నీ నవ్వుకు కారణమేమిటి కోపంగా అని అడిగింది.
చిత్రకేతువు అమ్మా! ఇంతమంది ఉన్న సభలో ఈ పరమేశ్వరుడు నిన్ను ఆలింగనం చేసుకొనియే ఉన్నాడు కదా అని నవ్వాను అని సమాధానం చెప్పాడు. మహర్షులు, త్రికాల వేత్తలు అధిక్షేపించని నన్ను నీవు అధిక్షేపిస్తావా నీవు రాక్షసునివై పుట్టుదువుకాక! అని పార్వతి చిత్రకేతువును శపించింది.
చిత్రకేతువు చిరునవ్వు వీడకుండా ‘అమ్మా! ఈ రాక్షస, మానవ, దేవతారూపాలన్నీ కూడా ఒకనాటికి పోయేవే కదా. నాకు ఏ రూపమైనా ఒక్కటే తల్లీ నాకు సుఖదుఃఖాలు లేవు. కేవలం నేను సదా నారాయణ మంత్రాన్ని మరవకుండా ఉండేలా వరాన్నివ్వు చాలు’ అని అన్నాడు. కాని అమ్మవైన నినే్న నీ స్థితి గురించిఅవినయంగా మాట్లాడాను కనుక నేను రాక్షసుడినై సంచరిస్తాను నీ ఆజ్ఞ నేను కాదనను తల్లీ’ అని నమస్కారం చేశాడు. నమస్కారం చేసే చిత్రకేతువు ఆశ్చర్యంతో పార్వతీ దేవి చూసింది. అపుడు పరమేశ్వరుడు ‘పార్వతీ! నారాయణ భక్తులు స్వర్గనరకాలను, సుఖదుఃఖాలను సమానంగా గౌరవిస్తారు. నీ శాపం ప్రకారం ఇతడు వృత్రాసురుడై జన్మించి అనంతరం నారాయణుని సాయుజ్యాన్ని పొందుతాడు’ అని చెప్పాడు.
ఇదిగో ఇలా వృత్రాసురుడే పూర్వజన్మలో చిత్రకేతువు అన్నమాట సుమా.

- రాయసం లక్ష్మి, 9703344804