AADIVAVRAM - Others

కరోల్‌బాగ్ అగ్నిపుత్రుడు (లోకం పోకడ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ భూమీద పుట్టిన ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే చాలా మంది తమ గురించి తాము తెలుసుకోలేరు. కనీసం అటువంటి ప్రయత్నం కూడా చేయరు. తామెందుకూ పనికి రానివారమని వాపోతూ ఉంటారు. తమలో నిద్రాణమై ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రపంచానికి చాటి చెబుదామని ఇసుమంత కూడా ప్రయత్నించరు. అయితే ఢిల్లీలోని కరోల్‌బాగ్‌కి చెందిన ప్రేమ్‌సింగ్ మాత్రం అటువంటి వారికి పూర్తిగా భిన్నమైన వ్యిక్తి. ఆయన తన చిన్నతనంలోనే తనలో నిబిడీకృత ఉన్న టాలెంట్‌ని గుర్తించి, విశేష సాధన ద్వారా నేడు నలుగురి చేతా ఔరా అనిపిస్తున్నారు.
ప్రేమ్‌సింగ్ శరీరం 200 డిగ్రీల ఫారిన్‌హీట్ వేడిని ఇట్టే తట్టుకుంటుంది. ఆయన వట్టి చేతులతో సలసల మరుగుతున్న వేడి నూనెలో కాగుతున్న ఫ్రై అవుతున్న చేప ముక్కలను సునాయాసంగా తీసి అందంగా ప్లేట్లలో అమర్చుతుంటాడు. అలా చేయడం వల్ల ఆయనకి చేతులు కాలడం గానీ, బొబ్బలెక్కడం గానీ జరగదు. 65 సంవత్సరాల ప్రేమ్‌సింగ్ తన శరీరం ఈ విధంగా వేడిని తట్టుకుంటుందన్న సంగతిని తనకు 25 ఏళ్లున్నప్పుడు గుర్తించారు. అంటే ఇది నలభై ఏళ్ల క్రితం నాడు జరిగిన సంగతన్న మాట. అప్పటి నుండి ఆయన ఇప్పటి వరకు అత్యంత వేడిని స్వయంగా స్పర్శిస్తూ కూడా ఎలాంటి ప్రమాదాన్ని చవిచూడడం లేదు.
అప్పట్లో ఒకసారి ఆయన చేతులపై సలసల మరుగుతున్న వేడి నూనె పడింది. అయితే చిత్రంగా ఆయన చేతులు కాలడం, గాయాలు కావడం, బొబ్బలెక్కడం వంటివేం జరగలేదు. దీనికి తొలుత ఆశ్చర్యపోయిన ఆయన ఇదేదో చిత్రంగా ఉందే... మరొకసారి చూద్దామని వేడి నూనెలో చేతివేళ్లు కొద్దిగా ముంచారు.
ఆశ్చర్యం...
మళ్లీ ఆయనకేం కాలేదు.
దాంతో ప్రేమ్‌సింగ్ వేడి తనకి ఎలాంటి హానీ చేయదని తెలుసుకున్నారు. అప్పటి నుండి కొద్దికొద్దిగా వేడిని పెంచుకుంటూ సాధన చేయడం మొదలుపెట్టారు. అలా ఇప్పటికి ఆయన రెండొందల ఫారిన్‌హీట్ వేడిని తట్టుకునే స్థాయికి చేరుకున్నారు. ఢిల్లీ కరోల్‌బాగ్‌లో ఆయన ఒక రెస్టారెంట్ నడుపుతుంటారు. ఫిష్ ఫ్రైకి ఆ రెస్టారెంట్ ప్రత్యేకత గాంచింది. అక్కడ రోజుకి దాదాపు నూటయాభై కేజీల ఫిష్ ఫ్రై అమ్మకాలు జరుగుతుంటాయి. కరోల్‌బాగ్ చుట్టుపక్కల వాళ్లతో పాటు టూరిస్టులు కూడా ప్రేమ్‌సింగ్ ఫిష్ ఫ్రై తినడానికి ఉత్సుకత చూపుతుంటారు. వట్టి చేతులతో ఎలాంటి రక్షణ లేకుండా సలసల కాగుతున్న నూనెలో వేగిన ఫిష్ ముక్కలను బయటికి తీసి ప్లేట్లలో సర్ది సర్వ్ చేసే ప్రేమ్‌సింగ్ విన్యాసాన్ని చూడడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుందని వారంటారు. ప్రేమ్‌సింగ్ ఒక్క ఫిష్ ఫ్రై మాత్రమే కాకుండా కస్టమర్లు కోరితే సీక్ కబాబ్, మటన్ టిక్కా, తందూరీ ఆలూ, ఆలూ టిక్కా వంటి వంటకాలను కూడా ఇట్టే వట్టి చేతులతో నూనెలో వేయించి వేడివేడిగా సర్వ్ చేస్తుంటారు. తన టాలెంట్ గురించి ప్రేమ్‌సింగ్ మాట్లాడుతూ ‘నా చిన్నతనంలో మా నాన్నగారు ఇలాగే సలసల కాగుతున్న నూనెలో చేపముక్కలను వేయించి వట్టి చేతులతో వాటిని బయటికి తీసి సర్వ్ చేసేవారు. అప్పుడు నాకది ఎంతో భయంగాను, ఆశ్చర్యకరంగా ఉండేది. అయితే ఒకసారి నా చేతులపై వేడి నూనె పడినా నాకేం కాకపోవడంతో ఆసక్తితో మొదట ఒక వేలుని వేడి నూనెలో పెట్టి చూశాను. కాలలేదు. తర్వాత రెండు, ఆ తర్వాత మూడు వేళ్లు వేడి నూనెలో పెట్టినా కాలకపోవడంతో మా నాన్నగారిలా నేనూ ఇదే వృత్తిని స్వీకరించి, నలుగురిని అలరిస్తున్నాను’ అంటూ చెబుతుంటారు.
ఈ విధంగా తనలోని ప్రత్యేకతను గుర్తించిన ప్రేమ్‌సింగ్‌లా అందరూ తమలో దాగి ఉన్న ప్రతిభనో, ప్రత్యేకతనో ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా గుర్తిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

- దుర్గాప్రసాద్ సర్కార్