AADIVAVRAM - Others

పక్షుల రంగుల వెనుక రహస్యం? (విజ్ఞానం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్భుతమైన వర్ణాలతో అందంగా కనిపించే పక్షులు అలా ఎందుకు ఉంటాయన్నది తేలిపోయిందంటున్నారు కొందరు పరిశోధకులు. ఈ భూగోళంలో దాదాపు 18 వేల జాతుల పక్షులు జీవిస్తున్నాయి. వాటిలో వేటికవే వివిధ రంగుల్లో, వివిధ తీరుతెన్నుల్లో, వివిధ అమరికలతో కూడిన వర్ణాలతో ఉంటాయి. ఏ జాతి పక్షులు వాటి ప్రత్యేకతను చాటుకునే రంగులతో ఎలా ఉంటున్నాయన్నదానిపై పరిశోధనలు సాగాయి. కొన్ని పక్షులు తేలికపాటి రంగుల్లో ఉంటే మరికొన్ని ముదురు రంగుల్లో ఉంటాయి. కొన్ని పక్షులు అందవికారంగా ఉంటే మరికొన్ని అద్భుతమైన అందాలను సొంతం చేసుకుంటాయి. ఆ తేడాలు ఎందుకు ఉంటాయన్నదానిపై కూడా అధ్యయనం సాగింది. శత్రువులను ఏమరచి సురక్షితంగా ఉండేందుకు వాటి ఈకలు వివిధ రంగుల్లో ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. అవి నివాసం ఉండే ప్రాంతాల్లోని రంగులతో ఇమిడిపోయి శత్రువుల కంటపడకుండా ఉండేందుకు సహజసిద్ధంగా అవి అలా ఉంటాయి. అయితే పక్షులన్నీ ఒకేలా ఉండకుండా రంగుల్లో తేడాలు ఎందుకు ఉన్నాయన్నది ప్రశ్న. దీనిపైనే పరిశోధనలు నిర్వహించారు. డాక్టర్ ఇస్మాయల్ గాల్వన్ సారథ్యంలోని నిపుణుల బృందం ఈ అధ్యయనం చేసింది. దాదాపు 9వేల జాతుల పక్షులను వారు పరిశీలించారు. ఆయా పక్షుల ఈకల్లో రెండు రకాలుగా ఉండే పిగ్నెంటేషన్ వల్ల ఆయా వర్ణాల ప్యాటర్న్ ఉందని కనుగొన్నారు. మెలనిన్ అనే పదార్థం వల్ల ఈకల్లో ఒక రకమైన నలుపు, బూడిద, గోధుమ, ఆరెంజ్ రంగులు ఏర్పడతాయని తేల్చారు. అలాగే ఆయా పక్షులు తినే ఆహారంలో లభ్యమయ్యే కరోటినాయిడ్స్ వల్ల ఈకల నిర్మాణంలోనే ప్రత్యేకతలు ఏర్పడతాయని, రంగుల్లో మెరుపువస్తుందని కనుగొన్నారు. ఆయా పక్షులు తినే ఆహారంలోని కరోటినాయిడ్స్ వాటి రక్తంలో ప్రవహించి ఈకల తయారీలో ముదురు రంగులకు, ప్రత్యేక రూపురేఖలకు కారణమవుతాయని ధ్రువీకరించారు. కరోటినాయిడ్స్‌ను పక్షులు తయారు చేసుకోలేవు. నిల్వ ఉంచుకోనూ లేవు. అందువల్లే ఎప్పటికప్పుడు అవి ఈకల తయారీ, రంగుల మేళవింపులో వినియోగమైపోతూంటాయి. పక్షుల్లో ఉండే మెలానోసైట్స్ కణజాలం వల్ల మెలానిన్స్‌ను శరీర వర్ణానికి కావలసిన విధంగా మార్చుకోగల శక్తి వాటికి ఉంది. పిగ్మెంట్స్, ఈకలు ఆయా పక్షుల రంగులను నిర్దేశిస్తాయని పరిశోధనలో తేలింది. 32శాతం పక్షుల్లో సంక్లిష్టమైన వర్ణవిధానం ఉందని అధ్యయనంలో తేలింది. దీనికి కరోటినాయిడ్స్‌కన్నా మెలానిన్స్ ప్రభావమే ఎక్కువని, అయితే కలర్ ప్యాచెస్‌కు కరోటినాయిడ్స్ కారణమని తేల్చారు. అయితే ఫ్రూట్ డోవ్స్, కొటింగాస్ వంటి కొంగల్లో ముదురు రంగుల విధానానికి మెలానిన్స్ కారణం కాకపోవడం విశేషమని వారు తేల్చారు. అవి తినే ఆహారంలోని కరోటినాయిడ్స్, మెటబాలిక్ మోడిపికేషన్స్‌వల్ల వాటికి ఆ ముదురు వర్ణాలు వచ్చాయని తేల్చారు.