Others

సాంస్కృతిక సోపానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ చరిత్రలో సాంస్కృతిక రంగ కళావైభవానికి నాంది పలికిన వారిలో బిఏవి శాండిల్య కూడా ఒకరు. అంతర్ కళాశాలల విద్యార్థులకు నాటక పోటీలు నిర్వహించి ఎందరో కళాకారులను సినిమా రంగానికి పరిచయం చేశారు. ఈ సంస్థకు సలహాదారులుగా అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఆదుర్తి సుబ్బారావు, దుక్కిపాటి మధుసూధనరావు తదితరులు వ్యవహరించేవారు. సెవెన్ స్టార్స్ సిండికేట్ పేరిట 70వ దశకంలో అనేక కార్యక్రమాలను కన్నుల పండువగా వీక్షకులకు అందించారు. శాండిల్య ఆ తర్వాతికాలంలో హైదరాబాద్ నుంచి వెలువడిన మొదటి సినీ వారపత్రిక వెండితెరను స్థాపించి ఎందరో జర్నలిస్టులు, రచయితలకు అవకాశమిచ్చారు. ఆ తరువాత చలనచిత్ర నిర్మాణ నిర్వాహకుడిగా ఆనందభైరవి చిత్రాన్ని జంధ్యాల దర్శకత్వంలో నిర్మించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులతోపాటు గుర్తింపుపొందారు. శాండిల్యతోపాటు ఈ సంస్థలో శిక్షణ పొందినవారు కూడా నిర్మాతలుగా ఉత్తమ చిత్రాలను నిర్మించే స్థాయికి ఎదగటం ఒక విశేషం.
సెవెన్ స్టార్స్ సిండికేట్ నిర్వహించిన ఓ కార్యక్రమం సందర్భంలో అక్కినేనితోపాటు శారద, చలం, శాండిల్య, జె లక్ష్మణరావు (ఖైదీబాబాయి, మంచిబాబాయి నిర్మాత)లు దిగిన బృంద చిత్రమిది.

-పర్చా శరత్‌కుమార్ 9849601717