AADIVAVRAM - Others

టిఫిన్ కావాలా? ఆరోగ్యం కావాలా? (మీకు మీరే ఢాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: టిఫిన్లు మంచివికావని మీరు చాలాసార్లు రాశారు. ఏ టిఫిన్లు ఎలా తింటే చెడు చేస్తుందో కొంచెం వివరంగా చెప్తారా?
జ: ఇప్పుడంటే టిఫిన్ తినకుండా ఉండలేక పోతున్నాం. మన పూర్వులు ఏం తిని బతికారో మరి! ప్రొద్దునపొట మెతుకు తగలకూడదనే సిద్ధాంతం ఒకటి కొత్తగా బయల్దేరింది. ఉదయాన్న టిఫిన్ తినకుండా ఏ పెరుగన్నమో తినేవాళ్లని చద్దన్నం తినే వాళ్లుగా తక్కువ చేసి చూసే తత్వం చాలా మందిలో ఉంది.
అన్నం మానేసి ఇడ్లీనో అట్టునో తిన్నామనుకోండి.. వాటి నిండా ఉన్నది బియ్యమే కదా! ఇంక అన్నం మానేసి సాధించిందేమిటి? సాంబారిడ్లీ, సాంబారు అన్నం రెండూ ఒకే విధంగా కేలరీలను పెంచుతాయి. అన్నం మాని టిఫిన్ తిన్నందువలన అదనపు లాభం ఏమీ ఒనగూరదు.
ఆకలేసినప్పుడు కాఫీనో టీనో తాగితే, ఈ కాఫీ లేదా టీ ఆకలిని తీర్చిందా లేక ఆకలిని చంపిందా..? నూరు శాతం ఆకలిని చంపేవే గాని అవి ఆకలి తీర్చేవి కాదు. అలాగే ఇడ్లీ, అట్టు, బజ్జీ పునుగులు కూడా ఆకలిని చంపుతాయి. వాటిని రోజూ తినటం వలన జీర్ణాశయ వ్యవస్థ దెబ్బతింటుంది. అవి ఎప్పుడో ఒకసారి సరదాగా తినాల్సినవే గానీ రోజూ తినవలసినవి కాదు.
తెలుగువారిది ఆది నుండీ ముప్పొద్దుల భోజనం అలవాటు. అంటే మూడు పూటలా అన్నం తినటం మన ఆహార సంస్కృతి. ఉదయాన్న బ్రేక్‌ఫాస్ట్‌గా మజ్జిగ లేదా పెరుగు అన్నం లైటుగా తినాలి. మధ్యాహ్నం లంచ్ ఘనంగా ఉండాలి. ఇంగ్లీషు వాళ్లు లార్జ్ మీల్స్ అంటారు. ఇంక రాత్రికి సప్పర్ చాలా తేలికగా ఉండే పదార్థాలు మాత్రమే తినాలి.
వారంలో శుక్రవారం అనీ, శనివారం అనీ, సోమవారం అనీ రాత్రిపూట భోజనం మానేసి ఉపవాసం చేయటం అనేది స్థూలకాయం, షుగరు, బీపీ, గుండె జబ్బులు, కీళ్లవాతం ఇలాంటి బాధలున్న వ్యక్తులు మధ్యమధ్య భోజన విరామం ఇవ్వటం మంచిదే! కానీ ఇక్కడే చిక్కు మొదలవుతుంది. రాత్రిపూట అన్నానికి బదులుగా పండ్లు తిని పడుకోవాలి. కానీ మనం ఈ టిఫిన్లకే ఫలహారం అనే దొంగ పేరు పెట్టుకుని బజ్జీలు, పునుగులు తింటున్నాం.
తక్కిన నూనె పదార్థాలతో పోలిస్తే ఇడ్లీ మెరుగైనదే కానీ, దాన్ని నెయ్యి, కారప్పొడి, శనగచట్నీ, అల్లప్పచ్చడి, సాంబారు వీటితో తింటున్నాం. ఇవన్నీ కడుపులో ఆమ్ల సముద్రాన్ని సృష్టించేవే కదా..!
బియ్యానికన్నా మినప్పప్పు ఎక్కువ కేలరీలను కలిగింది, ఎక్కువ షుగరుని పెంచుతుంది. పైగా కఠినంగా అరుగుతుంది. వాతం చేసే స్వభావం దానిది. మినుముతో చేసిన ఇడ్లీ, అట్టు, వడ, పునుగుల్లాంటివి ప్రతిరోజు టిఫిన్ల పేరుతో తింటుంటే పేగులు తమ శక్తిని కోల్పోతాయి. జీర్ణశక్తి దెబ్బతింటుంది. వాత వ్యాధులు ఎక్కువౌతాయి. కాబట్టి, టిఫిన్లను ఏ ఆదివారంనాడో, ఆటవిడుపు రోజునే సరదాగా తినండి. మిగిలిన రోజులు ఉదయంపూట మజ్జిగన్నం లేదా పెరుగన్నం తినటానికి ప్రయత్నించండి. నామోషీ పడకండి.
ఉప్పిడి ఉపవాసం అని ఒక పద్ధతి మనకుంది. బియ్యపు రవ్వని ఉడికించి, తాలింపు పెట్టుకొని తింటే అది ఉప్పిడి ఉపవాసం. అందులో ఉప్మాలో వేసేవేవీ ఉండవు. ఉప్పు కూడా బాగా తక్కువగా ఉంటుంది. రాత్రిపూట ఇలా లైట్‌గా ఉండే పదార్థాలతో కడుపు నింపుకుంటూ, ముప్పొద్దుల భోజన సంస్కృతిని పాటిస్తుంటే వ్యాధుల రాకని ఎప్పటికప్పుడు రేపటికి వాయిదా వేసుకోవచ్చు. ఇలా తీసుకుంటే కేలరీలు మన అదుపులో ఉంటాయి.
*
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట
పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com