Others

దుర్గమ్మకు జేజేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కం అమ్మకు దుర్గమ్మకు మా
కిమ్ముల గూర్చెడి జననకి నీప్సితకోటిన్
కమ్మగ నిచ్చెడి తల్లికి
కొమ్మని యొసగెద నతులను కోర్కెలు దీరన్

కం తల్లీ! వందన శతములు
మల్లెల మాలల పగిదిని మా నితరీతిన్
చల్లగ జూడుమనుచుకో
కొల్లగ నిచ్చెద ముదమున కొమ్మనుచున్

కం జయమును విజయము కలుగగ
భయములు తొలగగ ఘనమగు భవితను పొందన్
నయమును న్యాయము నొసగువి
జయరూప దుర్గను గొలుతు జయజయ యనుచున్

సీ దుష్టులనణచియు శిష్టుల గాచియు
కష్టాల తొలగించు కరుణమూర్తి
మహిషునిద్రుంచియు మంచిని కాపాడి
మమతల నిలిపిన మాతృమూర్తి
విద్యల నొసగియు వినయమ్మునొసగియు
జ్ఞానమ్మునిచ్చిన జ్ఞానఖనియె
ధైర్యమ్ము కల్పించి స్థైర్యమ్మురూపించి
పోరాట స్ఫూర్తికి మూర్తియామె
యుగయుగాలనుండి వరుస జగములందు
దుష్ట్భావాల ఖండించి దుర్మదాంధ
రక్కసుల నీచ కార్యాల రూపుమాపి
స్ర్తిల కాపాడి నట్టియే స్ర్తియే దుర్గ
జనుల కాపాడి నట్టి మా జనని దుర్గ

-బచ్చు రాంబాబు