Others

బరువు భారమైందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం మారుతోంది. ఆహారపు అలవాట్లూ మారుతున్నాయి. కేలరీలకు కేలరీలు తినేస్తుండటంతో దేహం మోయలేని భారమవుతోంది. కిలోలకొద్దీ కొవ్వు శరీరంలో పేరుకుపోతోంది. జీవన విధానంలో వచ్చే రోగాలు అన్నీటికంటే ప్రమాదకరం అని డబ్ల్యూహెచ్‌ఓ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే వుంది. అయినప్పటికీ మేల్కోనివాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్లందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది స్వప్నా వ్యాస్ పటేల్. 86 కిలోల బరువున్న స్వప్న ఏడాదిలో ఏకంగా 33 కిలోలు తగ్గి 53 కేజీలకు వచ్చింది. దీని వెనుక ఒకటే రీజన్. డైట్ కంట్రోల్, క్రమం తప్పని వ్యాయామం. అలాగని మనసు చంపుకుని కడుపు మాడ్చుకోవడం తన పద్ధతి కాదంటోంది. ఇష్టమైన ఐటెమ్స్ తింటుంది. కానీ ఏదీ అతిగా కాదు. ఏం తిన్నా రైట్ టైంలో తినాలనేది ఆమె చెప్పే సూత్రం. ఎన్నడూ క్రాష్ డైటింగ్ చేయలేదని చెప్తోంది. ఓవర్ ఎక్సర్‌సైజ్ అన్నమాటే లేదు. మొదట్లో ప్యాట్ బర్నింగ్ కోసం కార్డియో వర్కవుట్ చేసేది. కానీ తర్వాత వెయిట్ ట్రైనింగ్‌కి మారింది.
ఇంత బరువు తగ్గడమనేది అంత ఈజీగా జరగలేదంటోంది స్వప్న. హెల్దీ వెయిట్‌లాస్ కోసం షార్ట్‌కట్స్ లేవనేది ఆమె అభిప్రాయం. ప్యాట్ డైట్ వెంటనే శక్తినివొచ్చుగాక, కానీ అదే మన పాలిట మృత్యువు అవుతుందంటారామె. ట్రిక్స్ ద్వారా ఏదో చేయొచ్చు అనుకుంటే అది మొదటికే మోసం అవుంతుందని స్వప్న చెప్తోంది.
19 ఏళ్లప్పుడు నేను 86 కేజీల బరువు ఉండేదాన్ని. ఇపుడు 53 కేజీలకు వచ్చాను. అంటే 33 కిలోలు తగ్గాను. మొదట్లో అంత బరువున్నా నాకేం నామోషీ అనిపించలేదు. కొందరు ఆంటీ అని, అమ్మమ్మ అని రకరకాలుగా కామెంట్ చేశారు. అది విని హర్ట్ అయ్యాను. ఆ చిన్న సంఘటనే నన్ను ఇలా మార్చింది. వాళ్ల మాటలు కొట్టిపారేయాలన్న కసితోనే నేను ఇలా మారిపోయాను.
నా డైట్ ననె్నప్పుడూ ఆకలితో ఉంచలేదంటారు స్వప్న. ప్రతీ రెండు గంటలోసారి తినేదట. కానీ తక్కువ మోతాదులో తినేదాన్నని చెప్తున్నారు. మన శరీరం ఏదైతే కోల్పోతుందో దానే్న ఎక్కువగా కోరుకుంటుంది. ఉదాహరణకు తీపి పదార్థాలకు దూరంగా ఉన్నామనుకోండి. శరీరం దానే్న ఎక్కువగా కోరుతుంది. అందుకే రెగ్యులర్‌గా ప్రొటీన్ ప్యాట్ చెక్ చేసుకుంటానని స్వప్న తెలిపింది.
బరువు తగ్గడానికి ఏవేవో సీక్రెట్స్ ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ అవేం లేవంటోందామె. రెగ్యులర్‌గా డైట్ ఫాలో అయితే చాలు. ఇంకేం అవసరం లేదని ఘంటాపథంగా చెప్తోంది.
స్వప్న ఇప్పుడొక ఫిట్‌నెస్ ప్రొఫెషనల్. తన అనుభవం ద్వారా వందలమందికి బరువు తగ్గించుకునే మార్గం చెప్తోంది. ఫేస్‌బుక్‌లో సుమారు ఐదువేలమంది స్వప్నను ఫాలో అవుతున్నారంటే ఎంతమందికి ఆదర్శంగా నిలిచిందో అర్థం చేసుకోవచ్చు.

హ్యాట్సాఫ్ స్వప్న.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 1.5 బిలియన్లమంది అధిక బరువుతో బాధపడుతున్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఓవర్ వెయిట్ ఉన్నవాళ్లందరినీ సెపరేట్ చేసి ఒక దేశంగా మారిస్తే.. ఇండియా, చైనా జనాభాను దాటేస్తారు. అదీగాక ప్రపంచ వ్యాప్తంగా 63 శాతం మంది లైఫ్‌స్టైల్ డిసీజెస్ కారణంగానే చనిపోతున్నారట. ఇంకా సూటిగా చెప్పాలంటే ప్రతీ పదిమందిలో ఆరుగురు అధిక బరువు సంబంధిత వ్యాధులతో కన్నుమూస్తున్నారు.