Others

ఈ కళ వెరీ‘గుడ్డూ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్డు ఆరోగ్యానికే కాదు అందంగా అలంకరించటానికి ఉపకరిస్తోంది. కళకు కాదేది అనర్హం అన్నట్లు గుడ్డు పెంకు మీద అందమైన చిత్రాలను చిత్రీకరిస్తున్నాడు 24 ఏళ్ల జిజిన్ ఎస్. కుమార్. ఫేస్‌బుక్‌లో గుడ్డుపెంకుపై గీచిన ఓ చిత్రాన్ని చూసి ఈ కళను అభ్యసించిన జిజిన్ నేడు అంతర్జాతీయ ఆర్టిస్ట్‌గా ప్రసిద్ధిచెందారు. ఐదేళ్ల నుంచి కళకు పదును పెడుతూ గుడ్డు పెంకును సృజనాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. జిజిన్ వద్ద ఇపుడు వందకు పైగా గుడ్డు పెంకుపై చిత్రాలు ఉన్నాయి.
బల్లిగుడ్డు మొదలు..
తిరువనంతపురానికి చెందిన జిజిన్ కుమార్ ఆప్టోమెట్రిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈయన ఫేస్‌బుక్‌లోకి గుడ్డుపెంకుపై గీచిన చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఆ చిత్రం జిజిన్‌ను ఎంతో ఆకర్షించింది. దీంతో పెంకుపై చిత్రాలను గీయటం ప్రారంభించాడు. ఐదేళ్ల నుంచి ప్రాక్టీస్ చేయటం ఆరంభించాడు. బల్లి నుంచి నిప్పుకోడి గుడ్లపైనా అందమైన చిత్రాలను గీస్తాడు. రియా పక్షి గుడ్డు పెంకుపై ఆర్ట్ వేయటం ఎంతో ఇష్టమని జిజిన్ చెబుతాడు. ఈ చిత్రాలను సాయంత్రం వేళల్లోనే వేస్తుంటాడు. ఆ సమయంలో మంచి ఆలోచనలు వస్తాయని చెబుతున్నాడు. పని ఒత్తిడి ఉండదు. రిలాక్స్‌గా ఉంటాను కాబట్టి. ఇలా చిత్రాలు గీచేటపుడు జిజిన్ చేతిలో దాదాపు నలభై గుడ్ల వరకు పాడైపోయాయి. ఈ గుడ్డు ఆర్ట్ కోసం ప్రత్యేకమైన సూదులు, సాండ్ పేపర్స్ ఉపయోగిస్తాడు.
కాపో క్రియేషన్స్ ఏర్పాటు
జిజిన్‌తో పాటు ఇతని స్నేహితులు ఆరుగురు కూడా విభిన్న ఆర్టిస్టులు. వీరంతా కలసి ‘కాపో క్రియేషన్స్’ ఏర్పాటు చేశారు. ఈ యువ కళాకారులు గీచిన చిత్రాలతో కలిపి ఇటీవలనే తిరువనంతపురంలో ఎగ్జిబిషన్ సైతం ఏర్పాటు చేశారు. ఈ చిత్రాలను ‘కాపో క్రియేషన్స్ ఫేస్‌బుక్ పేజీలో అప్‌లోడ్ చేస్తుంటారు. ఈ కళను సజీవంగా తీర్చిదిద్దటమే తన కలగా జిజిన్ పేర్కొంటున్నారు.

ఫేస్‌బుక్‌లో గుడ్డుపెంకుపై గీచిన ఓ చిత్రాన్ని చూసి ఈ కళను అభ్యసించాను. ఐదేళ్ల నుంచి కళకు పదును పెడుతూ గుడ్డు పెంకును సృజనాత్మకంగా తీర్చిదిద్ద టం వల్లే అంతర్జాతీయ ఆర్టిస్ట్‌గా రాణిం చగలుగుతున్నాను. రియా పక్షి గుడ్డు పెంకుపై ఆర్ట్ వేయటం ఎంతో ఇష్టం.
-జిజిన్ ఎస్. కుమార్

-ఆశాలత