Others

సంస్కారానికి ‘అభినందన’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎదుట వ్యక్తిని అభినందించాలంటే ఎంతో పెద్ద మనసు ఉండాలి. అభినందనలు అందించే సమయంలో కొందరి మాటలు వింటూంటే నవ్వొస్తుంది. ‘‘ఓస్ ఇలాంటి కథలైతే నేను రోజుకోటి రాసి పడేస్తాను’’ అంటూంటారు. ‘‘మంచిదే! రాయి. ఇపుడు ఇలాంటి కథలకే విలువ’’ అంటే మళ్లీ మాట్లాడరు. వీరసలు పట్టుమని పది వాక్యాలు కూడా రాయలేరు.
వీరు మొత్తం కనపడిన పుస్తకమల్లా చదువుతారు. అయితే వారు దేన్నో ఆశించి చదువుతారనుకుంటాను. ఆ విధంగా లేకపోయేసరికి నచ్చదు. అన్ని పుస్తకాలూ చదవక్కర్లేదు, మంచి పుస్తకాలు చదివి అవగాహన చేసుకుంటే చాలు. కవో రచయితో ఏం చెప్పదలుచుకున్నారో అర్థమవుతుంది.
నేడు సర్వసాధారణంగా ఎన్నో సమస్యలని సందర్భాలని సంఘటనలని ఇతివృత్తాలుగా ఎంచుకుంటున్నారు రచయిత(త్రు)లు. దానికి తమ ఆలోచనలని మేధస్సుని ఉపయోగించి కథారూపం తెస్తున్నారు. చేతనైతే వారిని అభినందించి వారి కృషిని మెంచుకోవాలి. అందుకు అభిమానమడ్డువస్తే చదివి ఊరుకోవాలి. కువిమర్శలు చెయ్యడం సంస్కారమనిపించుకోదు.
గుడ్డెద్దు చేలో పడ్డట్లు పుస్తకాలు చదివి సరైన అవగాహన లేక అర్థం చేసుకునేందుకు ప్రయత్నం కూడా చేయక భాషా పరిజ్ఞానం లేక తాము రాయలేరు. రాసేవారిని విమర్శించేందుకు మాత్రం అందరూ తయారు.
ఏదైనా రచన చేయాలంటే కథ, కవిత, వ్యాసం, నవల నాటిక ఏదైనా దాని సంగతి పూర్తిగా తెలిసుండాలి. భాషమీద పట్టు వుండాలి. సందర్భాన్ని బట్టి పాత్రల స్వభావాల కనుకూలంగా ఆయా పాత్రలచేత మాట్లాడించగలగలి. సృజనాత్మకత లేనిదే ఇది సాధ్యం కాదు. ఇన్నిటితో రాయగలిగినా కొన్ని కారణాలవల్ల ఆ రచన ప్రచురణకి నోచుకోకపోవచ్చు. ఇన్ని బాలారిష్టాలు దాటి పత్రికలో వచ్చిన రచనలని ఎవరు రాసినా ఆదరించడం, అభినందించడం మన సంస్కారాన్ని వెల్లడిస్తుంది.

-ఆర్.ఎస్.హైమవతి