Others

ప్చ్..ప్రణీత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంటున్నారంతా ఇప్పుడు ఈ అమ్మడి కెరీర్‌ను చూసి. అవును.. నిజమే మరి! అగ్ర నటుల చిత్రాల్లో నటించినా, ఇప్పటికీ కెరీర్‌లో ఏ మాత్రం ఎదగలేదు. ఎన్నో ఆశలతో, మరెన్నో కోరికలతో వెండితెరపై వెలిగిపోవాలని ఆరాటపడింది. ఆమె ఆరాటమంతా నీరుగారిపోయింది. ప్రేక్షకుల్లో కొందరు హీరోయిన్లకు గుర్తింపు ఉంటుంది కానీ, వారికి అవకాశాలు మాత్రం అంతగా ఉండవు. అలాంటి కథానాయికల జాబితాలో ప్రణీత ఒకరు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోతుందని భావించిన ఈ కన్నడభామ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చినా, మెయిన్ రేంజ్‌కి ఎదగలేకపోయింది. పవన్‌కళ్యాణ్, ఎన్‌టిఆర్ వంచి క్రేజీ కథానాయకులతో జోడీ కట్టినా ప్రయోజనం లేకపోయింది. సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితం అయింది. ఒకప్పుడు సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టిన ఈ అమ్మడు ఇక లాభం లేదనుకుందో ఏమో తన దృష్టిని ఇతర వ్యాపారాలవైపునకు మళ్లించింది. టాలీవుడ్‌లో ఏ మాత్రం ఆఫర్లు లేకపోయినా ఈ రకమైన అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఈ బాటలోనే బెంగళూర్‌లోని తన పబ్ బిజినెస్ విస్తరించడంపై ఎక్కువగా దృష్టిసారిస్తోందిట. టాలీవుడ్‌లో మాత్రం సినిమాలేవీ లేకపోయినా షాపింగ్‌మాల్స్ ఓపెనింగ్ వంటి ఈవెంట్స్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడిందట. గత కొద్దినెలలుగా ఈ పనిలోనే ప్రణీత సందడి చేసిందట. ప్చ్..ప్రణీత! *