Others

జంతు ప్రేమికులూ.. జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంతు సంరక్షణ కేంద్రాల నుంచి తెచ్చుకున్న కుక్కలు, పిల్లులే మేలు అని భావిస్తున్నారు జంతు ప్రేమికులు. జంతు సంరక్షణ కేంద్రాల్లోని జంతువులనే దత్తత తీసుకోవటానికి వీరు మక్కువ చూపుతున్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. దీనికి కారణం లేకపోలేదు. ఈ తాజా అధ్యయనంలో దాదాపు అరవై శాతం మంది జంతు సంరక్షణ కేంద్రాలవైపే మొగ్గుచూపుతున్నారట. యజమానుల వద్ద నుంచి కుక్క, పిల్లులను తెచ్చి పెంచుకుందామంటే సహజసిద్ధమైన వాటి క్రూర స్వభావం అపుడపుడు బయటపడుతుందట. ఎందుకంటే యజమానులు వాటికి ప్రేమతో ఆహారాన్ని అందించకపోవటం, వాటి పోషణ పట్ల జాగ్రత్తలు తీసుకోకపోవటంవల్ల అవి అపుడపుడు పెంచుకునేవారి పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నాయనే విషయం బయటపడింది. యజమానులు పెంచిన వాటిని ఇంటికి తెచ్చి పెంచుకుందామంటే భయమేస్తుందని జంతుప్రేమికులు చెబుతున్నారు. ఇంట్లో ఉండే చిన్న పిల్లలకు వీటిని మచ్చిక చేయాలంటే వెనుకంజ వేస్తున్నారు. కొత్త వాతావరణంలో పిల్లలకు కుక్కలను మచ్చిక చేయాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు యజమానులు. ఏదిఏమైనా రెస్క్యూ కేంద్రాల్లోని పెంపుడు జంతువులే మేలు అనే నిర్ణయానికి అరవైశాతం మంది జంతు ప్రేమికులు వచ్చేశారు. మరింకెందుకు ఆలస్యం మీకు కూడా పెంపుడు కుక్కను పెంచుకోవాలనే మక్కువ ఉంటే దగ్గర్లోని సంరక్షణ కేంద్రానికి వెళ్లటం మంచిది.