Others

ఫిట్‌నెస్‌కు ఫిదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమె కండలు తిరిగిన వ్యాయామ నిపుణురాలు. అంతకంటే ముందు ఓ వైద్యురాలు. వెయిట్‌లిఫ్టింగ్ ఎక్సర్‌సైజ్ చేయటంలో దిట్ట. సిక్స్ ప్యాక్‌తో కండలు తిరిగి బలిష్టంగా ఉండటానికి మగవాళ్లు కసరత్తులు చేయటం సహజంగా మనం చూస్తుంటాం. మగవాళ్లకు ఏమాత్రం తీసిపోనంటూ ఈ వైద్యురాలు కూడా కండలు పెంచుకోటానికి మక్కువ చూపుతోంది. బెంగళూరులో రేడియాలజిస్ట్‌గా పనిచేస్తున్న శే్వతాదేవరాజ్‌కు వ్యాయామం అంటే ఎంతో మక్కువ. అందమైన ఆకృతికే కాదు ఆరోగ్యానికి వ్యాయామమే సరైన ఔషధం అని నమ్మే ఈ వైద్యురాలు తాను చేసే వ్యాయామాల చిత్రాలు సామాజిక మాధ్యమాలలో షేర్ చేసుకోవటానికి ఇష్టపడుతుంది. ఈమె పోస్ట్ చేసిన వ్యాయామ చిత్రాలు అంతర్జాలంలో హల్‌చల్ చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఫిట్‌నెస్ అంటే ఎంతో ఇష్టం. ఆ తరువాతే ఇల్లూ, ఇతరత్రా విషయాలూ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పే శే్వతాదేవరాజ్ మహిళలకు ఫిట్‌నెస్ ప్రాధాన్యత తెలిజేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతుంది. అంతర్జాలంలో తన వ్యాయామచిత్రాలు చూసి మరింత మంది మహిళలు ముందుకు వచ్చి వ్యాయామం పట్ల అభిరుచి పెంచేలా చేయాలనే సంకల్పంతో కృషిచేస్తోంది. ప్రకృతిలో లభించే గాలి, వెలుతురు, నీరు వంటి వాటిని కూడా వ్యాయామ వనరులుగా వినియోగించుకోవటం విశేషం.ప్రతి రోజు స్విమ్మింగ్‌ఫూల్ వద్దకు వెళ్లి అక్కడ నీటిలో తన ప్రతిబింబం పడేలా కాసేపుకదలకుండా వ్యాయామం చేస్తుంది. నీళ్లు కదలకుండా నిశ్చలంగా ఉండేవరకు వేచి ఉండాలంటే ఎవరికి అంత ఓపిక, ఓర్పు, సమయం ఉంటుంది..? కాని శే్వతాదేవరాజ్ మాత్రం ఎన్ని గంటలైనా వేచి చూస్తుంది. ఇలా నీటిలో ప్రతిబింబం పడేలా కూర్చొని ఎక్సర్‌సైజ్ చేయటం వల్ల ఆలోచనా విధానంలో మంచి మార్పు సంభవిస్తుంటుందని చెబుతుంది.

వెయిట్ లిఫ్టింగ్ అంటే ఎంతో ఇష్టం..

ఫిట్‌నెస్, వైద్యం అనే రెండు వృత్తులు కొనసాగిస్తున్నాను. మొదటి ప్రాధాన్యత ఫిట్‌నెస్స్‌కే. కండలు పెంచుకోవటం అంటే ఇష్టం. అవంటే నాకు ఎంతో ఇష్టం. మనిషిలో దాగివున్న శక్తికి నిదర్శనం కండలు అని చెప్పవచ్చు.కొన్నాళ్ల క్రితమే మాంసం తినటం మానేశాను. ఇపుడు పూర్తిగా శాఖాహారిని. కండలు పెంచాలనుకునే మహిళలకు నడక, వెయిట్‌లిఫ్టింగ్ సరైన వ్యాయామం. కష్టపడటం, క్రమశిక్షణకు నిదర్శనంగా కూడా చెప్పవచ్చు. న్యూట్రీషియన్ సలహాలతో శాఖాహారానే్న తీసుకుంటున్నాను. అంతేకాదు జంతువులు చంపటం వల్ల పర్యావరణానికి హాని చేసినవారమవుతాం. విభిన్న వృత్తుల్లో రాణించినట్లే ఇలా వైద్య, వ్యాయామ రంగాల్లో రాణించటానికే ఎక్కువ ఇష్టపడతాను అని శే్వతాదేవరాజ్ చెబుతుంది.