Others

‘పవర్’లిఫ్టర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మజిజీయా భాను పవర్ లిఫ్టర్. సంకల్పం, ఆత్మవిశ్వాసమే ఆలంబనగా చేసుకుని ఈ క్రీడలో రాణిస్తోంది. మగవారి ఆధిపత్యం అధికంగా ఉండే ఈ క్రీడలో ఓ ముస్లిం యువతి అంతర్జాతీయ స్థాయిలో రాణించటం అంటే మాటలు కాదు. కాని మజిజీయా భాను జిమ్‌ను తన జీవితంలో విడదీయరాని బంధంగా చేసుకుని, కేరళ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్‌లో మంచి క్రీడాకారినిగా తనదైన ముద్ర వేసుకుంది. కేరళలోని ఒరాకటేరీని అనే గ్రామం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే అది భాను నివశించే ప్రాంతం. కాని గత ఏడాది నుంచి ఈ గ్రామం అంతర్జాతీయ క్రీడాపటంలో చోటు సంపాదించుకుంది. మలేసియాలో జరిగిన ఆసియా పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో 370 కిలోల విభాగంలో ఆమె వెండి పతకాన్ని సాధించింది. పాఠశాల స్థాయి నుంచే అథెటిక్స్, బాక్సింగ్‌లో రాణిస్తున్నా రాని పేరు ఆసియా గేమ్స్‌లో పతకం సాధించటంతో రావటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని భాను ఆనందపడిపోతుంది.
సడలని సంకల్పం..
జిమ్నాస్టిక్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రాణించేవారంతా నగరాల్లో ఉండే క్రీడాకారులే. ఎందుకంటే అక్కడ సౌకర్యాలు ఉంటాయి. శిక్షణ తీసుకోగలుగుతారు. కాని భాను నివశించే ఒరాకటేరి అనే ప్రాంతం ఓ చిన్న గ్రామం. ఎలాంటి సౌకర్యాలు లేవు. అయినప్పటికీ సడలని సంకల్పంతో ఈ క్రీడలో శిక్షణ తీసుకున్నది. వెయిట్ లిఫ్టింగ్, ఫవర్ లిఫ్టింగ్ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. వెయిట్ లిఫ్టింగ్‌లో ఒలింపిక్స్ వరకు వెళ్లవచ్చు. కాని పవర్ లిఫ్టింగ్ జాతీయ పోటీల్లో రాణించిన తరువాతే ప్రపంచ చాంపియన్ స్థాయి పోటీలకు వెళ్లాల్సి ఉంటుంది.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..
ఈ క్రీడలో తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే రాణిస్తున్నాను. నాకు పూర్తిస్వేచ్ఛను ఇంట్లో ఇచ్చారు. భాను సోదరుడు మంచి ఈతగాడు. తాను కూడా ఏదైన క్రీడలో రాణించాలనే తపన, ఆసక్తి భానులో ఉండేది. ఇందుకు తల్లిదండ్రులు సమ్మతించటంతో ఓ సారి ఆమె సోదరుడి స్విమ్మింగ్ శిక్షణ ఇచ్చే మాస్టర్ వద్దకు వెళ్లింది. ఆయన ఇచ్చిన సలహాతో కోజికోడ్‌లో ఉన్న బాక్సింగ్ ట్రైనర్ వద్ద చేరింది. భాను సామర్ధ్యాన్ని గమనించిన బాక్సింగ్ కోచ్ పవర్ లిఫ్టింగ్‌లో రాణిస్తారని సలహా ఇవ్వటంతో ఇందులో ఆమె శిక్షణ తీసుకుని అంతర్జాతీయ క్రీడాపోటీల్లో రాణించే స్థాయికి చేరుకున్నారు. బిడిఎస్ విద్యార్థిని అయిన భాను తెల్లవారుజామునే మేల్కొంటుంది. నమాజ్ చేసుకున్న తరువాత ఏడు గంటలకు కాలేజీకి వెళుతుంది. మూడున్నరకు ఇంటికి వస్తుంది. అక్కడ నుంచి శిక్షణ, చదువు.. ఇదే ఆమె లోకం. వారానికి ఒక్కసారి కోజికోడ్ వెళ్లి పవర్ లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుంటుంది. ఆసియా గేమ్స్‌లో వచ్చిన గుర్తింపుతో మరింతగా ఈ క్రీడపై దృష్టి సారించింది. భానుకు రాష్టస్థ్రాయి పోటీల్లోనే కాదు విశ్వవిద్యాలయ స్థాయి పోటీల్లోనూ ఎన్నో పతకాలు సాధించింది. 2017 సంవత్సరానికిగానూ బెస్ట్ స్పోర్ట్స్ ఉమెన్ అవార్డు సొంతం చేసుకుంది.

-టి.ఆశాలత