Others

ఉపవాసం అంటే నిరాహారం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప అంటే దగ్గరగా/అంటుకుని, వాసము అంటే ఉండడం. ఉపవాసం అంతిమ లక్ష్యం భగవంతునికి సమీపంగా, ఆత్మదర్శనార్ధియై ఉండడం. నిత్యకర్మల చేత అలసిన శరీరం, మనసు వాటినుండి దూరంగా జరిగి భగవత్ తత్వానికి దగ్గరగా వుండగోరుకోవడమే ఉపవాస దీక్ష పరమార్ధం. ఉపవాసానికి దగ్గరి మార్గాలు రోజువారీ బాధ్యతలనుండి తాత్కాలికంగా దూరంగా జరగడం, సమయపాలన ద్వారా భగవంతుని ధ్యానానికి సమయాన్ని కేటాయించడం, ఆహార నియమాలను అదుపులో వుంచుకోవడం, కోరికలను, ఆవేశాన్ని, ఆరాటాన్ని అదుపులో వుంచుకోవడానికి ప్రయత్నించడం, వౌనంగా వుండడానికి ప్రయత్నించడం, ప్రాజ్ఞులసలహాలు, సందేశాలు ఆలకించడం, ఆత్మీయ పలకరింపులు, సాత్విక ఆహారం మొదలైనవి. దురదృష్టవశాత్తు నేడు జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ఉపవాసం అంటే మనిషి నిరాహారంతో రోజంతా గడపడం అనే భావన పేరుకుపోయింది. కోరికల వత్తిడినుండి దూరంగా జరిగిన భగవంతున్ని ధ్యానించడం అనే సూత్రం కాస్తా కోరికల చిట్టాను ముందుంచుతూ భగవంతుడ్ని ప్రార్ధించడంగా మారిపోయింది.
ఉపవాసం యోగాభ్యాసంలో ఒక భాగం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరామాచార్యులు ఆరవ అధ్యాయం 15, 16,17 శ్లోకాలలో చాలా స్పష్టంగా ఉంది. అతిగా భోజనం చేసే వ్యక్తి, నిరాహారుడు, అతిగా నిద్రపోయే వ్యక్తి, నిద్రను త్యజించే వ్యక్తి అంటే నిద్రాహారాలను ఒదులుకునే మనిషి యోగాన్ని పొందజాలడు అని చెప్పడం జరిగింది. దీనికి వారు సూచించిన సూత్రం, తను సృష్టించిన పంచ భూతాలతో కూడిన ప్రకృతి ప్రసాదమే మానవ దేహం, ఆ దేహాన్ని ఆవహించి వున్న ఆత్మస్వరూపుడు తాను కనుక ప్రకృతి ధర్మాలను గౌరవించడం దేహం యొక్క విధి. ప్రకృతి ధర్మాలకు సృష్టికర్త అయిన తానూ కూడా అతీతుడు కాదు. అంటే దేహానికి, ఆత్మకు మధ్య నిలిచి వున్న ప్రకృతిని, ప్రకృతి ధర్మాన్ని విస్మరించిన వాడిని అనుగ్రహించడంలో దైవం కూడా అశక్తుడే.
నియమిత ఆహారం అనేది శరీర ధర్మం. ఆ ధర్మాన్ని కాదని శరీరాన్ని శుష్కించడం, ఇంద్రియాలను బలహీనపరచడం సుకర్మ ఎంతమాత్రం కాదు. దానివలన ఇంద్రియాలు బలహీనపడతాయి, తమ స్వాభావిక విధులను నిర్వర్తించే సామర్ధ్యాన్ని కోల్పోతాయి. అసహజంగా శరీరాన్ని, ఇంద్రియాలను నిర్జించడం, క్రియాశూన్యం చేయడం, బలహీనపరచడం ప్రకృతి విరుద్ధం అంటే పరమాత్మ తత్వానికి విరుద్ధం. యోగాధ్యాయంలో సుకర్మ (ప్రకృతి ధర్మం పాటించడం) కూడా ఒకటి. గీతాచార్యుని ప్రకారం మనసును కేంద్రీకరించడం వలన మాత్రమే ఉపవాసము సాధ్యమవుతుంది. మనసు నిశ్చలంగా భగవంతుని మీద కేంద్రీకరించాలంటే ఇంద్రియాలు మనసు ఆదేశాలను పాటించాలి. దేహం మనసు నియంత్రణలో ఉండాలి అంటే దానికి సరైన పోషణ అవసరం. అందువల్ల నిరాహారానికి, ఉపవాస దీక్షకు మధ్య తేడాను గ్రహించి, నియమిత సాత్వికాహారాన్ని స్వీకరిస్తూ ఆ శక్తిని భగవంతుని మీద మనసును కేంద్రీకరించడానికి వినియోగిస్తే ఆత్మసాక్షాత్కారానికి మార్గమేర్పడి ఉపవాస దీక్ష పరిపూర్ణమవుతుంది.

-చందుపట్ల రమణకుమార్‌రెడ్డి