Others

మమకారమూ మాయే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతా వింటునే ఉన్నా ఆ బోయివానిలో కాస్తయినా చలనం లేదు. మాట కూడా లేదు. రహూగణునికి ఆశ్చర్యం వేసింది. అంతలో అతని తమ్ములమని చెప్పిన వారు మహారాజా ! మేము కూడా ఇతనిని బహుకష్టాల పాలు చేశాము కాని కాస్తయినా కష్టం పడినట్టుగా కనిపించడితడు. ఎపుడూ దేనికోసమో ఎదురుచూస్తుంటాడు. మనమెంతా ఎన్ని మాట్లాడినా జవాబు ఇవ్వడు. అతను మాట్లాడాలనుకొన్నపుడే మాట్లాడుతాడు అని చెప్పాడు.
బోయి వానిని చూసి మహారాజు‘ఓ బోయి నీ కథ వింటుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తోంది. అసలు నీవు ఎవరు? ఎందుకిలా ఉన్నావు. సమాధానం ఇవ్వమేమిటి ? వీరు చెప్పేదంతా నిజమేనా’ అని మహారాజు అడిగాడు.
అపుడు ఆ బోయి వాడు. ‘నిజమే మహారాజా! ’అన్నాడు.
‘ఏమిటి నీకు మంచి భోజనం పెట్టినా, పాచిపోయినది పెట్టినా తింటావా. నిన్ను తిట్టినా కొట్టినా పడతావా. అసలు నీకు ఏమీ అనిపించడం లేదా!’ అంటూ ఎంతో ఆశ్చర్యంతో రహూగణుడు అడిగాడు.
‘మహారాజా! మీరు చేసేవన్నీ కేవలం ఈ శరీరానికే కదా వర్తించేవి. ఈ శరీరం ఎన్ని రోజులుంటుంది? నేను పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి పోషించినా, గంజి నీరు పోసి పెంచినా ఈ శరీరం ఒకనాటికి నశించేదే కదా’ అన్నాడా బోయివాడు. ఈ మాటలకు బ్రహ్మోపదేశం పొంది ఈ దుర్లభమైన మానవ జన్మను సార్థకం చేసుకోవాలని వెళ్లుతున్న రహూగణునికి ఆశ్చర్యం, ఆనందం ఏదో తెలియని అవ్యక్తానందం కలిగాయి.
వెంటనే ‘మహానుభావా! అసలు మీరు ఎవరు? ఎందుకిలా ఉన్నారు. మీ నిజ స్వరూపమేమిటి? మీరు నాకు బ్రహ్మోపదేశం చేయడానికి వచ్చిన మహర్షులా ? నేను మీ చేత పల్లకిని మోయించుకున్నానే నేను ఎంత అజ్ఞానిని. . నన్ను క్షమించండి. దయచేసి మీరు ఎవరో చెప్పండి. నన్ను కరుణించండి ’’అంటూ పదేపదే రహూగణుడు ఆ బోయి వాని రూపంలో ఉన్న మహానుభావుణ్ణి వేడుకుంటున్నాడు. అతనిలో మాత్రం సంతోషదుఃఖాలు కలగడం లేదు. నిమిత్తమాత్రుడిని నేను అన్నట్టుగా చూస్తున్నాడు. తన మాటలు విన్నా సమాధానం ఇవ్వని వానిని చూసి సాష్టాంగ దండప్రమాణాలు ఆచరించి స్వామి నాకు జ్ఞాన భిక్ష పెట్టండి అని రహూగణుడు అడిగాడు.
అహంకార మమకారాలు ఏవైనా మరుజన్మకు కారణాలే మహారాజా! దేవేంద్రుని సభలో ఉన్నవారికైనా అహంకారం పొటమరిస్తే చాలు వారు అథఃపాతాళానికి చేరవలసిందే. అట్లే మమకారం అంకురిస్తే చాలు యజ్ఞయాగాదులుచేసినా, తపస్సుశక్తిని ఎంత ఆర్జించినా సరే వారు మళ్లీ జన్మనెత్తవలసిందే. ఈ విషయనిరూపణ చేసేదే నా ( భరతుని)వృత్తాంతం. జయంతి ఋషభుల కుమారునిగా నేను భరతుడు అన్న పేరుతో వ్యవహరించబడ్డాను. అపుడు ఆ భరతుని అంటే నా ఇల్లాలు పంచజనని. మేము ఐదుగురు పుత్రులకు తల్లిదండ్రులయ్యాము. ఎన్నో యేండ్లు రాజ్యాన్ని పరిపాలించాను. భరతుడు ధర్మమూర్తి అని పేరుకూడా వచ్చింది. నా పాలన వల్లనే భూమికే భరతవర్షం అన్నపేరు కూడా లభించింది.
కాని నా మనసుకు ఎందుకో రాజరికం పట్ల ఏవగింపు గలిగింది. రాజరికం పట్ల అనురక్తుడినయ్యాను. ఇక వార్థక్యం వచ్చింది కనుక నేను తపోభూమికి తరలిపోతాను అని నిశ్చయంచుకున్నాను. వెంటనే రాజ్యం మీద దారాపుత్రాదుల మీద వ్యామోహం వదిలి వెంటనే రాజ్యాన్ని పుత్రులకు అప్పగించాను. ఒంటరిగా వనాలకు బయలు ధేరాను. అక్కడ నేను ఎన్నో నియమనిష్టలు పాటించాను. ప్రాణాయామా విధులను నిర్వర్తిస్తున్నాను. గండకీనదీతీరంలో పులహాశ్రమాన్ని నా నివాసస్థలంగా చేసుకొన్నాను. నా భోగభాగ్యాలన్నింటినీ ఇతరులకు పంచి ఇచ్చి ఈ ఆశ్రమానికి వచ్చాను. నా మనసు అన్నింటి పట్ల వ్యతిరేకత కనబరిచింది. దేనిపైనా ఆసక్తి ఉండేది కాదు. ఇలా కాలం సునాయాసంగా గడిచిపోతుంది. కొన్నాళ్లుకు ఓ విచిత్రం జరిగింది.
(ఇంకా ఉంది)

- డాక్టర్. రాయసం లక్ష్మి