Others

మొత్తం మెక్కేశారు.. చెక్కేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇలాంటి సన్నివేశాలు వెండితెరమీద చూస్తాం. ఉన్నదంతా నాకేసి ఆనక రెస్టారెంటు యజమానికి ఎగనామం పెట్టడం చూడ్డానికి బాగానే వుంటుంది కాని.. జరిగితే? ఇంగ్లాండ్‌లోని గ్లోసేస్టార్ నగరం చాలామంది ‘బ్యాంకాక్ క్యాంటీన్’లో థాయిలాండ్ భోజనం అంటే ఇంగ్లీషు జనాలు పడి చస్తారు. పోయిన మంగళవారం ఓ జంట క్లాసుగా అక్కడ టేబుల్ బుక్ చేసుకొని హాయిగా వచ్చి కూర్చొని- ముందు ‘నోరు పోచుకునే’ సూపులు అడిగి మొత్తం జుర్రేశారు- కుడితిలాగ ఉందన్నారు. ‘‘అమ్మమ్మా! అలా కాదు మొత్తం పూర్తి భోజనం ‘జుమ్బోటమయూం’ పులుసు, ‘మస్సామన్ కర్రీ’ - ఈ రెండూ గొప్ప రుచికరమైన ఖరీదయిన థాయిలాండ్ భక్ష్యాలు చూష్యాలున్నూ! తినడం మొదలెట్టేరు. తింటూ వున్నంతసేపు ‘‘ఇది తిండా? చెత్త వంటకాలు’’ అని ఆడిపోసుకుంటూనే ప్లేట్లు శుభ్రంగా నాకేశారు.. ఆఖరికి డెకరేషన్‌కి బల్లమీద పెట్టిన పువ్వులను కూడా నమిలేశారు. బిల్లు తెచ్చింది అందాల భామ అయిన ఒక వెయిట్రెస్! ‘‘నీ మొహంలాగుంది తిండి’’ అన్నారు. యజమానితో వాదం వేసుకున్నారు. ఈ చెత్త తిన్నందుకు నువ్వే ఎదురివ్వాలి అన్నారు. ఇది ఇంగ్లీషు దేశం. ఇక్కడి చట్టాలు మీకు తెలియాలి, ఇది బాంకాక్ కాదు- చెత్త పెట్టి డబ్బులు అంటే కుదరదు.. చెప్పాడు యజమాని. మొత్తం మరో కస్టమరుకి లేకుండా లాగించేశారు. క్రక్కండి మా అరవై పౌండ్ల యాభై షిల్లింగులు కదలండి అంటూ. ఇక బేరమాడేరు జంట. ఓ యాభై తగ్గించి అరవై పౌండ్లు ఇస్తామన్నారు. పోలీసులొచ్చేలోగా ఈ జంట ‘బౌజావుట్’ అయిపోయారు. ఒక్క పెన్నీ ఇవ్వలేదు. వెనుకవాళ్ళకి ఓ మెతుకయినా తిండి మిగల్చలేదు.
ఇదేమి ఇంగ్లీషు మేనర్సురా బాబూ అంటూ పోలీసులు కూడా నవ్వేసి ‘‘బ్యాంకాక్ సూప్ వుంటే కొట్టు మేడం, పరిగెత్తుకొచ్చాం మీ పిలుపుకి’’ అన్నారు. మాకు లేక ఆకు నాకుతూ వుంటే పాయసం ఉన్నదా? అన్నట్లుంది సారూ మీ మాట? కావాలంటే ఓ పెగ్గు వేసుకుని సిసి కెమేరాల దగ్గరికి పోండి అన్నది బార్ బాసమ్మ!