Others

బాలల పండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండగండి పండగ
చిన్నారుల పండగ

వాడవాడల్ల పండగ
మాబడిలోన పండగ

బాలలు నచ్చేపండగ
పెద్దలు మెచ్చే పండగ

రంగురంగుల తోరణాలు
మా బడికే ఆభరణాలు

గులాబీల హారంచేసి
చాచాజీ మెడల్ వేసి

విశ్వశాంతియే సందేశం
శే్వత కపోతం సంకేతం

పంచశీల మనవాదం
విశ్వానికి మనవేదం

మానవాళి పొగడగ
మానవతయె మనుగడ

పండగండి పండగ
బాలలకే పండగ

బెహరా ఉమామహేశ్వరరావు సెల్: 9290061336