Others

కొంగైనా కుంగాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమయం చూసి శ్రీకృష్ణుడు కూడా గోపబాలలూ ఈ దూడ ఎంత మంచిదో చూడండి అంటూ వెనుక నుంచి వెళ్లి ఆ దూడ రెండు కాళ్లు పట్టుకొని పైకెత్తి వెలగచెట్టుకేసి మోదాడు. ఆ దెబ్బకు దూడ లోని వత్సాసురుడు కేకలు పెడుతూ చనిపోయి కిందపడ్డాడు. బాలకులందరూ కృష్ణుని బలాన్ని మెచ్చుకుంటూ అతడిపై పూవులను ఆకులను చల్లారు. ఆకాశం నుంచి దేవతలు పుష్పవృష్టి కురింపించారు. అతి సునాయాసంగా వత్సాసురుడను రాక్షసుడు శ్రీకృష్ణుని చేతిలో సంహరించబడ్డారు.
సాయంత్రం దాకా ఆడుకున్న పిల్లలు, పశువులు అలసిపోయి ఇంటికి తిరుగు ముఖం పట్టారు. వారంతా దగ్గరలోని తటాకంలో కాళ్లు చేతులు కడుక్కుని నీరు తాగి అలసట తీర్చుకుంటూ ఇంటి ముఖం పట్టారు.
కాని దారిలో బకాసురుడను రాక్షసుడు కొంగ రూపంలో మహాభయంకరాకారంలో కూర్చుని కనిపించాడు. పెద్ద కొండశిఖరంగా కనిపించే ఆ కొంగను చూచి గోపబాలకులు భయపడి వెనక్కు తగ్గారు. కొంగ మాత్రం తన చూపును ఏకాగ్రం చేసి కృష్ణుని మీద లగ్నం చేసింది. ఉన్నట్టుండి ఆ కొంగ ఒక్క ఉదుటన ఎగురుతూ చెట్లు విరుస్తూ కృష్ణుని మీదకు దూకింది. రెక్కలు టపటపలాడిస్తూ కృష్ణుడిని మింగివేయాలని ఉబలాటపడింది. భక్తుల కోరికలు కాదనలేని దైవంలాగా కృష్ణుడు కూడా కొంగ మింగుతుందేమో చూద్దామని చూస్తున్నాడు. సర్వ జగత్తును తన కుక్షిలో దాచుకున్న కృష్ణుణ్ణి కొంగ కడుపు దాచుకొందామనుకొంటే ఆ పరంధాముడు నవ్వక ఏం చేస్తాడు కదా. అందుకే కొంగ కోరిక తీరేట్లుగా కృష్ణుడు కొంగ గొంతులోకి వెళ్లిపోయాడు. ఆహా మింగాసాననుకొని కొంగ శతవిధాలుగా కృష్ణుని తన కడుపులోకి పంపింద్దామనుకోసాగింది. కాని గొంతున ఉన్న కృష్ణుడు ప్రచండ వాయువులు పుట్టించాడు. బకాసురుని గొంతు ఆ కృష్ణాగ్ని వల్ల తట్టుకోలేక కృష్ణున్ని కక్కేసాడు. బయటకు వచ్చిన కృష్ణుడు ఈనపుల్లను విరిచినట్లుగా బకం నోటిని రెండు చేతులతో పట్టుకొని చీల్చివేసాడు. ఒక్కదెబ్బకు బకాసురుడు యమసదనానికి దారి వెతుక్కుంటూ వెళ్లిపోయాడు.
ఆ బకం నుంచి తప్పించుకుని వచ్చిన కృష్ణుని భయాశ్చర్యాలతో గోపబాలకులందరూ వచ్చి గట్టిగా పట్టుకొని నువ్వు క్షేమమే కదా అని ఆలింగనం చేసుకొన్నారు. కృష్ణునికి ఆపద రానందుకు వారు దేవుడికి కృతజ్ఞతలు చెప్పారు. వారంతా కృష్ణుని పట్టుకుని ఇక మనం ఇక్కడ ఎక్కువ సేపు ఉండకూడదు పదండి వెళ్దాం. ఇంకా ఇక్కడ ఉంటే ఏ ఆపదలు చుట్టుముట్టాతాయో అని గబగబా అడుగులు వేస్తూ బృందావనంలో వారి పెద్దల దగ్గరకు చేరారు. వారికి ఎదురైన సంఘటనలను పూసగుచ్చినట్టు చెప్పారు. వారంతా ఆ మాటలు విని కృష్ణుడికి వచ్చే ఆపదలను నివారించమని దేవదేవుని కోరుకున్నారు.
***

- చరణ శ్రీ