Others

శ్రీమద్విరాట పర్వం(నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కిన రంగుల చిత్రం ‘శ్రీమద్విరాటపర్వం’ మాకు నచ్చిన పౌరాణిక చిత్రరాజం. ఇది ఎన్టీఆర్ నటనా వైభవాన్ని పలు విధాలుగా ఆవిష్కరింపజేసిన శతదినోత్సవ సంచలన పౌరాణిక చిత్రం.
ఎన్టీఆర్ కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణ, దర్శకత్వపు బాధ్యతలతోపాటు ఐదు పాత్రలు (పంచ పాత్రాభినయం) శ్రీకృష్ణ, సుయోధన, అర్జున, బృహన్నల పాత్రలలో, సింహబలుడిగా ప్రతినాయక పాత్రలో నెగెటివ్ షేడ్స్ చూపించడం ఈ సినిమా ప్రత్యేకత. రమారమి నలభైపై దాటిన వయస్సులో బృహన్నలగా నాట్యం చేస్తూ శిష్యురాలికి చేయిస్తూ జోరును హుషారును చూపడం అఖిలాంధ్రులను సంభ్రమాశ్చర్యాలలో ముంచివేసింది.
కథానాయికగా సైరంద్రి పాత్రలో కళాభినేత్రి వాణిశ్రీ కడు నేర్పుతో రాణించి శాభాష్ అనిపించుకుంది. వీరాభిమన్యుడుగా నందమూరి బాలకృష్ణ నూనూగు మీసాల నూతనోత్తేజంతో పలువురిని ఆకర్షించాడు. ఆయన సరసన నటించిన భవానీ చాలా అందంగా బాగుంది. పాటల విషయానికొస్తే- ‘ఆడవే హంసగమన’, ‘రమ్మని పిలిచిందిరా ఊర్వశీ’ ఈనాటికీ నిలిచి వున్న కమ్మని పాటలు. బాలమురళీ స్వరాలు వినసొంపులనిపించాయి. నందమూరి మోహనకృష్ణ ఫొటోగ్రఫీ స్పష్టంగా ఉంది. కథ, పాటలు, సంగీతం, నటీనటుల హావభావాలు చక్కగా సమకూర్చబడిన ఈ చలన చిత్రం అద్భుతంగా ఉంటుంది.
-కూర్మాచలనం వెంకటేశ్వర్లు, కరీంనగర్