Others

‘జైహింద్’ అంటేనే హాజరైనట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యప్రదేశ్‌లో గవర్నమెంటు స్కూళ్లలోనే కాదు ప్రైవేటు స్కూళ్లలో కూడా దేశభక్తిని పెంపొందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇస్కూల్ ఏదైనా అటెండెన్స్ తీసుకోవాలిగా- ఘటోత్కచుడి మాయాబజార్‌లో కూడా దానవ విద్యార్థులు- పెద్దమామయ్యా అంటే శుక్రాచార్యుడు వచ్చి అటెండెన్స్ పిలిస్తే పలికారు గాదా? ‘‘హాయ్ జియా - హౌయ్ జియా. జియావ్’ అంటూ ఎవడి స్టయిల్లో వాడు పలికేవారుగా. మన బాలలు కూడా ‘ఎస్సార్- హియర్ సార్- ప్రెసెంట్ మాం’ అంటూ రకరకాల కూతలతో- మరీ బద్ధకస్తులైతే- ఇలా చెయ్ ఎగరేసి హాజరు పలకడం కూడా కద్దు. కానీ, మధ్యప్రదేశ్ గవర్నమెంటుకి ఈ ఇంగ్లీషు వాసనలు నచ్చలేదు. దేశభక్తి నేర్పాలి పిల్లలకి అనుకుని మొత్తం రాష్ట్రంలోని లక్షా ఇరవై రెండు వేల ఇస్కూళ్లలోనూ కొత్త రూల్స్ పెట్టేశామని విద్యామంత్రి విజయ్ షాగారు ఫర్మానా జారీ చేస్తూ దేశమంటే స్కూల్లే అని ఉద్ఘాటించారు. అసలు ప్రయోగాత్మకంగా అక్టోబరు ఒకటి నుంచే- సాత్నా జిల్లాలోని పాఠశాలలో జయ్ హింద్ రూలు అమలు చేసి చూశారు. పిల్లలు జైహిం, జైన్, జైలాగా హ్రస్వీకరించి ఈ మాటను అటెండెన్సు పలుకుతూ వున్నా- పేరెంట్స్ ప్రత్యర్థి పార్టీ నాయకులు అభ్యంతరం పెట్టలేదు. ఇదీ, సుభాష్ చంద్రబోసుగారి నినాదం- చెయ్యత్తి జెండా వందనంతో కలిపి అనాలి కదా? అన్నారు కొందరు బెంగాలీ శాల్తీలు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కునాల్ చౌదరి సణిగాడు. దేశభక్తి అటెండెన్స్ ఇలా చెబితేనే వస్తుందా? మైనారిటీలేమంటారో? అని కానీ టీచర్ల సంఘం బాస్ అషుతోష్ పాండే- ఎవరికీ అభ్యంతరాలు లేకపోతే ఒకే అన్నాడు. ఇది ఇలా వుండగా రాజస్థాన్‌లో ప్రతీ స్కూలు ప్రొద్దునే్న జెండా వందనం- జెండా ఎగరేసి మరీ చెయ్యాలనుంటుంది సదరు సర్కారు. హలో, హాయ్, హైలు ఎత్తేయాలి అంటారు వాళ్ళు. అసలు జైహింద్ జైహింద్ అంటూ పరస్పరం పలకరించుకోవడం, కౌగిలించుకోవడం చెయ్యాలి అన్నారు కొందరు బడా నాయకులు. ఆదాబ్ అర్జ్, గుడ్‌మార్నింగ్‌లు కూడా రాజ్యాంగబద్ధం చేయబడాలి అన్నాడు ఒక దొరగారు. మిషన్ ఇస్కూళ్లల్లో మేము రోజూ జెండా ఎత్తడం దించడం చెయ్యాలి అంటే యాతనే మరి, పైగా పేరెంట్స్ చాలామంది ఒప్పుకోరేమో? అంటూ తల్లిదండ్రులచేత నో చెప్పించాలని ప్లాన్ వేసుకున్నారు. ఏది ఏమైతేనేమి 94 శాతం బడులలో తగిన సదుపాయాలే లేవు. జెండా ఖర్చులు అదనం అన్నారు ‘క్రై’ అనగా ‘చైల్డ్ రైట్స్ అండ్ యు’ అనే సర్వే సంస్థవారు మధ్యప్రదేశ్ గవర్నమెంటుతో. ఎలాగో అలా పోనిద్దురూ- జైహింద్ అనకపోతే పొట్టి చేసి జై అంటారు కదా- లేకపోతే జై శ్రీరామ్ అంటూ అందరూ గ్రీట్ చేసుకోవాలి అంటూ జీవో వచ్చేస్తుందేమో? అంటూ ఇకిలించాడో డ్రిల్లు మాస్టారు. జైహింద్!..
ముంబాయి ‘వర్సిటీ పేపర్ రూ.250కే’!
ముంబాయి యూనివర్సిటీ బిఎమ్‌ఎస్ మూడవ సంవత్సరం పరీక్షా పత్రాలు- ఎగ్జాంకి రెండు గంటలన్నరకి ముందుగా లీకై కేవలం రెండు వందల యాభైకే దొరికాయి. ఓ అమ్మాయి ఈ దొంగ పేపర్ కాపీ రాస్తూ దొరికింది. ఆ లతాంగినిని నిలదీస్తే పేపర్‌ని వాట్సాఫ్ ద్వారా సంగ్రహించేమని తెలిపింది. మొత్తం 11మంది స్టూడెంట్ దొంగలు ఒప్పుకున్నారు- ఏంబిఎస్ డిగ్రీ అనగా బ్యాచులర్ ఆఫ్ మీడియా స్టడీస్. అమ్బోలి పోలీసు స్టేషన్ పోలీసులు ఈ లతాంగి ద్వారా మిగతా విద్యార్థి దొంగల్ని వాళ్ళ ద్వారా అసలు సోర్స్‌ని పట్టుకున్నారు. అంధేరిలో వున్న కాలేజీ తన విద్యార్థి ఒకడు మొబైల్ సాయంతో కాపీ కొడుతున్నాడు అని పట్టుకున్నారు. అసలు పేపర్ వాడి దగ్గర దొరికింది. అఖిలేష్ బాగుల్ అనే కంప్యూటర్ టెక్నిషియన్- యూవర్సిటీ సిస్టంలో నుంచే ఈ పేపర్ని ఇమెయిల్ ద్వారా పట్టేసి- ఓ పదివేల రూపాయలకి అమ్మేశాడు- ఇద్దరు తెలివైన బద్ధకస్తులైన విద్యార్థులు చిన్న బేరాలకి రెండు నుంచి ఐదు వందల దాకా రేటు పెట్టి అమ్ముకున్నారు- దొరికిపోయారు.. వైఫై ప్రాట్ విద్యార్థి జనమహక్కు- డాటాకార్డు సౌకర్యం ఎందుకు? ఆధునికులు అడగాల్సిన ప్రశ్నలా ఇవి?
ఏనుగుతో పెట్టుకోకు..
సాదిక్ రెహమాన్ చేసేది జల్పైగురిలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగమే- పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్ హైవే నెంబరు ముప్ఫై నాలుగు ప్రక్కనే వున్న గౌరీ నేషనల్ పార్క్- పక్కనుంచి డ్యూటీకి పోతూ ఓ అందమయిన గజరాజు షికారుకి వచ్చింది కాబోలు- ఈ సాదిక్ కంటపడ్డది. వెంటనే కారు దిగి దానితో ఫొటో లాగిద్దాం అనుకున్నాడు. ట్రాఫిక్‌కి అడ్డంగా కారాపి ఒక స్నాప్ ప్లీజ్ అంటూ వెళ్ళాడు. పాపం సెల్ఫీ అడగలేదని కోపం వచ్చిందేమో? చేట చెవులు అడ్డంగా ఊపింది. ‘రోకో రే.. ఉల్లూ’ అంటూ తన కెమెరాలోకి చూస్తూ ముందుకి పోబోయాడు సాదిక్. అంతే, తొండంతో లాగి క్రింద పడేసింది. మొర్రో మొర్రో మంటున్నారు తతిమ్మా జనాలు- వాల్ కెమెరాలకి పని చెప్పారు. ఓ పావు గంట మట్టేసి హుందాగా హైరోడ్ ప్రక్కనున్న అడవిలోకి నడిచింది ఏనుగు. ఈ రోడ్డుమీద ఇలా కొన్ని వందల మంది ఏనుగు పిచ్చోళ్లు మత్త్భే నృత్యానికి బలి అయిపోయారు అని అధికారుల లెక్కలు ఇచ్చారు తాపీగా.. చావు ఎలా వస్తుందో? ఆ ఏనుగుకి మాత్రం తెలుసా? ఫోటో ఇష్టం లేదంతే!

వీరాజీ