Others

చక్కెర అంటే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదొక కార్బోహైడ్రేట్. శరీరానికి తక్షణమే శక్తినిస్తుంది. ఇది చాలా మొక్కల్లో సహజ సిద్ధంగా ఉంటుంది. మొక్కలు సూర్యరశ్మిని ఆహారంగా మార్చుకునే ఫోటోసింతసిస్ ప్రక్రియకు తోడ్పడేదే సుక్రోజ్. ఈ కార్బోహైడ్రేట్లు రక్తంలో కలిసి శరీరంలోని అన్ని కణాలను చేరడం ద్వారా వాటికి శక్తినిస్తాయి. చెరుకులో సుక్రోజ్ భారీ పరిణామంలో లభిస్తుంది. చెరకు, షుగర్ బీట్స్ అనే దుంపల్లో అత్యధికంగా ఉంటుంది. చక్కెరనే సూక్రోజ్ అని కూడా చెబుతారు. ఈ సుక్రోజ్‌ను చెరకు నుంచి వేరుచేసి శుద్ధి చేసి చక్కెర పలుకులుగా తయారుచేస్తారు.
చక్కెర వివిధ రూపాలు
సుక్రోజ్:దీన్ని టేబుల్ షుగర్‌గా పేర్కొంటారు. గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌తో తయారవుతుంది. చెరుకు, షుగర్ బీట్స్ నుంచి తయారుచేస్తారు.
ఫ్రక్టోజ్, గ్లూకోజ్:ఈ రెండూ పండ్ల, కూరగాయలు, తేనెలో ఉంటాయి.
లాక్టోజ్:పాలు, పాల ఉత్పత్తుల్లో లభిస్తుంది.
మాల్టోజ్:మాల్ట్ షుగర్ అనేది మా ల్టెడ్ డ్రింక్స్, బీర్‌లో ఉండేది.
మన దేశంలో చక్కెర వినియోగం
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం మన దేశంలో సగటున ఓ వ్యక్తి చక్కెర వినియోగం 58 గ్రాములుగా ఉంది. చైనాలో ఇది 33 గ్రాములే ఉంది. బ్రెజిల్‌లో ఇది 152 గ్రాములు, మెక్సికోలో 104 గ్రాములు ఉంది. పాకిస్తాన్, అమెరికా, ఇండోనేషియాల్లోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన 25 గ్రాముల పరిమితికంటే ఎక్కువగానే ఉంది.