Others

ప్రాణులన్నీ పరమాత్మ రూపాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అదికాదు కృష్ణా మాకు నీతోడి కూర్చుని ఆటలు ఆడుతూ పాటలు పాడతూ చల్ది తినాలని ఉంది ’అన్నారు వారు. వారు అనుకొన్న ప్రకారం తమ తమ ఇండ్లల్లో చల్ది మాకు ప్రత్యేకంగాచేసి ఇవ్వమని వారి తల్లులను అడిగారు. పిల్లలు సరదా పడుతున్నారు కదా అని వారి అమ్మలంతా రకరకాల పిండి వంటలు కూడా చేసి ఇచ్చారు. పెరుగన్నాలు, చిత్రాన్నాలు, రకరకాల వంటలు చేసి కావళ్లల్లో పెట్టివారికి ఇచ్చారు.
వీరు ఇంకా తూర్పున సూర్యుడు బయలు దేరకముందే గోపబాలురు అంతా తమ పశువులను తోడ్కొని అడవికి బయలుదేరారు. కృష్ణయ్యకూడా నెమలి పింఛాన్ని ధరించి వారితో తన చల్దిని చంక తగిలించుకొని బయలుదేరాడు.
సౌకుమార్య సంపన్నుడైన శ్రీకృష్ణుని యశోదమ్మ తల్లి బంగారు నగలతో అలంకరించింది. బృందావనంలోని బాలలందరినీ వారి వారి తల్లులు కృష్ణుణ్ణే అలంకరించుతున్నామనుకొన్నారు. వారి దగ్గర ఉన్న బంగారు నగలను అలంకరిస్తూ అందరికీ నెమలిఫించాన్ని ధరింపచేశారు. వారంతా కూడా కృష్ణుని పోలిన కృష్ణుల్లా ఉన్నారు. కృష్ణుడే ఇన్ని అవతారాలు దాల్చాడా సర్వం కృష్ణమయం అన్నట్లుగా పట్టు పీతాంబరాలు ధరించి మొలకు బంగారు మొలతాడు కట్టి పాదాలు బంగారు మంజీరాలు దాల్చి మెడలో పులిగోరు గొలుసులు ధరించి చేతులకు కంకణాలు, వంకీలు, మురుగులు దాల్చి వారు అడుగులు వేస్తుంటే వారి మంజీరాలనుంచి వచ్చే ధ్వని అప్సరసలు నాట్యం చేస్తున్నట్టుగా ఉంది. అందరూ అమ్మలు వారి వారి పిల్లలను చూసుకొని మురిసిపోతూన్నారు. పిల్లలంతా తమను తాము కృష్ణునితో పోల్చుకుని పొంగిపోతున్నారు. అంతా కలసి కావడులు భుజాన తగిలించుకుని అడవి బాట పట్టారు. అందరూ ఉల్లాసంగా ఎగురుతూ,దుముకుతూ దారిలో చెట్ల ఆకులను తుంపుతూ కాయలు కోస్తూ పూవులు తెంపి ముందువాళ్లమీద పోసి దేవతలు ఆకాశంనుంచి పుష్పవృష్టి గురిపిస్తున్నారని చెబుకుంటూ వెళ్తున్నారు.
***
వారిని చూస్తున్న విరించి పెళ్లున నవ్వాడు. ‘నారదా చూడు వారి కోరిక. వారిపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తున్నారట’ అన్నాడు.
అవునుమరి శ్రీకృష్ణుడే వారి చెంత నిలిచి నడుస్తుంటే దేవతలే ఎందుకు బ్రహ్మసరస్వతులే పూలు చల్లడానికి వచ్చారు కదా’ అంది సరస్వతీ దేవి నవ్వుతూ.
నారదుడు వారిద్దరినీ పట్టించుకున్నట్టు లేడు. ఆయన కృష్ణుడినే చూస్తున్నాడు. ఆనంద తన్మయత్వంలో మునిగిపోయాడు.
***
కృష్ణబృందం ముందుకు వెళ్తూ దారిలో వచ్చే చెలమలను, చెరువులను తటాకాలనుచూస్తూ ఉన్నారు. వారికి దారిలో పువ్వులు పరిచారా అన్నట్టున చెట్లను చూశారు. వాటి మధ్యమధ్యలో పెద్ద పెద్ద వృక్షాలను చూశారు. చల్లని పచ్చని పెరిగిన పైరును చూశారు.
‘‘కృష్ణా కృష్ణా ! ఇక్కడ చూశావా ఎంత బాగుందో పచ్చని తివాచి పరిచినట్టు లేదా చూడు. ’’అన్నాడు గోపాలుడు.
‘‘అవును కృష్ణా! ఎంత బాగుందో ఈవైపు చూడు ఎంత బయలుప్రదేశం పచ్చగా గడ్డి మొలిచి ఉందో ఇక్కడైతే మన పశువులు చక్కగా గడ్డితింటూ రాత్రి దాకా ఉండగలవు. మనం ఇక్కడే ఈ వృక్షాలను ఊయలలు కట్టి ఊగనూ వచ్చు. ఇక్కడే ఉందాం కృష్ణా! అన్నాడు నరసింహుడు.
‘‘కృష్ణా నోరు తెరువుతెరువు... ’’అంటూ నోరు తెరిపించేసి తాను దోసిలితో తెచ్చిన నీటిని ఆ కృష్ణుని నోట్లో పోసేశాడు. ‘రుచి చూశావా కృష్ణా తియ్యగా కొబ్బరి నీరులాగా ఉన్నాయి. కదా మనం ఇక్కడే వుందాం గోపాలా.. ’’అన్నాడు సుధాముడు.
ఇలా అందరూ అక్కడే ఉండడానికి ఉత్సాహం చూపారు.
‘‘ మీయిష్టమే నా ఇష్టం. కనుక మీరు ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటాం. మరి ఇంకే ఆ కావడులు దించండి. ఇక ఆడుకొందా. ’’
‘‘ఓ గోవుల్లారా! మీరంతా ఇదిగో ఈ కనబడే ప్రదేశంలో గడ్డి తినండి మేము మీ చెంతనే ఉంటూ ఆడుకుంటాం. అందరం కలసి సాయంత్రం ఇంటికి వెళ్దాం’’అన్నాడు కృష్ణుడు అందరూ రణగొణ ధ్వనులు చేస్తూ కేకలు వేస్తూ కేరింతలు కొడుతూ ఆగారు. భుజాన ఉన్న కావిడులు దించాడు. వెంటవెంటనే చెట్లు ఎక్కేస్తున్నారు. పువ్వులు తెంపి వాసన చూస్తున్నారు..
అంతలో ‘‘కృష్ణా! మనం ఆడుకుంటూ ఈ పశువులను మరిచిపోతావేమో. ఇవి ఎటైనా వెళ్లిపోతే ఎలా చేద్దాం’’అన్నారు.
అవునౌను అంటూ దిగాలు గా కూర్చున్నారు.
‘‘ఓయి మీకు ఈ దిగులెందుకు కృష్ణుడు ఏదైనా చేసేస్తాడులే. మరేంఫర్లేదు’’అన్నాడు రాముడు.
‘‘సరే పదండి వాటికి చెప్దాం. అవి వింటాయి ’’అంటూ అందరూ ముందుకు వెళ్లారు. అందరికన్నా కృష్ణుడు వెళ్లాడు. అక్కడ పడి ఉన్న ఎండిన కట్టెనొకదానిని తీసుకొన్నాడు. ఆ నిలిచి వున్న పశువుల చుట్టూరా ఒక గీత గీశాడు.
‘ఓ గోవత్సముల్లారా ఇదిగో ఈ గిరి ని దాటి వెళ్లకండి సుమా మేము ఇక్కడే ఉంటాం. మీవైపు మేము. మావైపు మీరు చూస్తూ ఉందాం. ఏమంటారు’’అన్నాడు కృష్ణుడు.
ఆ పశువులన్నీ తలలూపాయి. కృష్ణా! కృష్ణా అవి తలలూపాయి. ఇక నీ మాట కాదని అవి ఎటూ పోవు. మనం నిశ్చింత. నీకు చెబితే చాలు. నీవు మా మాట వింటే చాలు. మాకు బోలెడంత నిశ్చింత. అన్నాంతా ఒకేసారి .
***

- చరణ శ్రీ