AADIVAVRAM - Others

తొలి తెలుగు వెలుగులు ఈ గడ్డపైనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరీ తీర ప్రాంతంలో వేంగీ ప్రభువు రాజరాజ నరేంద్రుడు తెలుగు భారతికి పల్లకీ ఎత్తటానికి సుమారు శతాబ్ది ముందుగానే, తెలంగాణ మాగాణంలోని వేములవాడ చాళుక్య సంస్థానం, తెలుగు ముఖ్యంగా సంస్కృత, కన్నడ భాషా సరస్వతికి నీరాజనాలు అందించారు. క్రీ.శ.650 నుండి మూడు శతాబ్దాలకు పైగ, తెలంగాణ సీమలోని ప్రస్తుత నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ఇతర ప్రాంతాలను, వేములవాడ చాళుక్య సామంతరాజులు, సర్వ స్వతంత్రులుగా వ్యవహరించలేక పోయినా, ‘బోధన’ ‘వేములవాడ’ రాజధానులుగా పరిపాలించినట్లు, శిలాశాసనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చారిత్రక ఆధారాల నేపథ్యంలో, వేములవాడ చాళుక్యుల కాలంలో జైన మత ప్రచారానికి సోమదేవ సూరి, పంప మహాకవి వంటి నిష్ణాతులైన పండితులు సాహిత్య సృష్టి చేయటంతో, భాషా వికాసానికి నేటికీ ఆద్యులుగా పరిగణింపబడుతున్నారు. పంప మహాకవి కన్నడ సాహితీ జగత్తులో ఆదికవిగా సుప్రసిద్ధుడై, నన్నయ కంటే ముందే జైన మత ధర్మ ప్రచార లక్ష్యంతో, పంప భారతంగా సుపరిచితమైన తన విక్రమార్జున విజయంలో వ్యాసప్రోక్తమైన ప్రాచీన మహాభారతంలో జైన ధర్మం జొప్పించి, మతానురక్తి, తీవ్ర భక్తితో కవితాగుణార్ణవునిగా కీర్తి పొందాడు. పంప మహాకవి, అల్పాక్షరాలలో అనల్పార్థ భావ కథా కథనంతో, పంచమ వేదమైన మహాభారతాన్ని కేవలం ‘అరికేసరి రాజ పురాణ పరం’గా వెలువరించటం కారణంగా దోషారోపణల విమర్శలకు గురి అయ్యాడు. అప్పటికి, భాషాపరంగా తెలుగుతనం ఇంకా కొలిక్కి రాలేదు. మత సాంస్కృతికతకు, రాజ్యాధిపతులు ప్రాధాన్యం ఇచ్చే శతాబ్ది కాలం అది. తెలుగునాట ఏడవ శతాబ్ది నుండి పదవ శతాబ్ది వరకు, తెలంగాణ వేములవాడ చాళుక్య పాలక ప్రభువులు జైనానికి పెద్ద పీట వేశారు. కానీ తదనంతర శతాబ్దిలో అంతవరకు 850 సంవత్సరాలు పైగా రాజ, ప్రజాదరణతో విలసిల్లిన జైనమతం పతనావస్థకు చేరింది. వీరశైవం కూడా తర్వాత విజృంభించింది. అనంతర కాల చారిత్రక పరిణామాలలో, శుద్ధ వైదిక సముద్ధరణ ఆశయ లక్ష్యంతో నన్నయ మహాభారత కావ్య రచనకు ఉపక్రమించాడు. తెలుగు భాషకు కావ్య రచనార్హత విస్తృతి, సౌష్ఠవం కలిగించిన నన్నయ శబ్ద శాసనుడు, ఆదికవిగా గౌరవింపబడుతున్నా, తెలుగులో నన్నయకు ముందు కవిత్వమే లేదని భావించటం సహేతుకం కాదు. సర్వదేవుడు (జైనకవి పొన్నమయ్య) భీమన, కవి జనాశ్రయ కర్త మల్లియ రేచన నన్నయకు పూర్వమే తెలుగు ఛందస్సులు, మన ప్రాచీన కవుల ఘంటంపై వీర విహారం చేశాయి. నన్నయ నాటికే జాను తెనుగనేది ఉంది. జానపద బాణీలున్న ఆనవాళ్లున్నాయి. 11వ శతాబ్దం వరకు వున్న శాసనాలలో పద్య, గద్య శైలి అద్భుతంగా ఉంది. ప్రాకృత పదాలు ఎక్కువగా వున్నా క్రీ.శ.550 - 200 రేనాటి చోళ రాజుల కాలంలో రాజభాష తెలుగుగా తెలుగు శాసనాలున్నాయి. పశ్చిమ చాళుక్య రాజులు క్రీ.శ.6, తూర్పు చాళుక్య రాజుల క్రీ.శ.550 - 800 కాలంలో తెలుగు శాసనాలున్నాయి. ఎంత కాదనుకొన్నా, క్రీస్తు శకారంభం నుండి స్థిరపడిన భాషకు, క్లాసికల్ స్టేటస్‌లో, వెనకబడి వుందనే అవమానాన్ని ఎదుర్కోవలసి రావడం తప్పలేదు. ‘క్లాసికల్ స్టేటస్’ అనే ఆంగ్ల పదంతో, కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న భారతీయ భాషలలో తెలుగుకు వున్న ప్రాచీనతా హోదా తక్కువేమీ కాదు. ఈ అపవాదాన్ని తోసిపుచ్చే సత్య నిరూపణా సత్కృషిలో, తెలంగాణ సీమలోని వేములవాడ చాళుక్య రాజాశ్రయంలోని పంపన మహాకవి, సోదరుడు జినవల్లభుని శాసనాధారాలు వెలుగు ప్రసరింపజేస్తున్నాయి.
కమ్మ నాటిలోని వంగిపర్రు నివాసి, పంపకవి తండ్రి భీముడు, తీవ్ర జైన మత అభినివేశం కారణంగా, జినేంద్ర ధర్మం, సర్వమతోత్కృష్టమని భావించి తెలంగాణ సీమ చేరుకొన్నట్టు విక్రమార్జున విజయంలో చెప్పబడింది. ‘బోధన’ నగరం అంటే ప్రస్తుత నిజామాబాద్ సమీపంలోని బోధన్ రాజధానిగా పాలించిన వేములవాడ చాళుక్య రాజాశ్రయం పొందిన పంపన మహాకవి, అతని సోదరుడు జినవల్లభుడు అక్కడే జీవించినట్టు శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. జినవల్లభుని కుర్క్యాల శాసనంలో తాము తెలుగు వారమని సూచించడానికా, అన్నట్టుగా శాసనం చివర తెలుగులో మూడు కంద కావ్యాలు చెక్కించాడు. చారిత్రక పరిశోధకులు నేలటూరి వేంకట రమణయ్యగారు ఎంతో జిజ్ఞాస, ప్రయాసతో చరిత్ర గతిని మార్చే ఆ అద్భుత పరిశోధన కనుగొని వెలుగులోకి తెచ్చారు. 1928లో నేలటూరి, జినవల్లభుని శాసనం కనుక్కొని భారతిలో శాసన ఆధారంతో ప్రచురింపచేయటం, కన్నడ మహాకవి పంపన తెలంగాణ నివాసిగా తిరుగులేని సాక్ష్యం అయింది. ప్రాచీన కాలం నాటి వృషభాచల శిఖరం మీద కొండ ప్రాంతంలో జినవల్లభుని శిలాక్షర శాసనం, కొండపైన పంప మహాకవి పేరుతో శిలాక్షర సాక్ష్యంగా నెలకొని వున్న సమాధి, తెలంగాణ తెలుగు సాహితీ ఉజ్జ్వల మహోన్నతను సాక్షాత్కరింపజేస్తోంది.
బోధన్ చారిత్రక వైభవం
కన్నడ ప్రప్రథమ మహాకవి పంపన తెలంగాణ సీమలో వేములవాడ చాళుక్యాధీశుడైన అరికేసరి ఆస్థానాశ్రయం పొంది, ఇక్కడే బోధన్ ప్రాంతంలో పరమపదించారనే చారిత్రక వాస్తవం, కర్ణాటక రాష్ట్రంలోని విశ్వవిద్యాలయ ఆచార్యులు, చరిత్ర పరిశోధకులు జీర్ణించుకోలేని సత్యం అయినా అంగీకరించక తప్పలేదు. జైన దేవాలయాలు నిర్మించటం, జిన మునుల్ని పూజించటం, జైన భిక్షువులకి అన్న వసతి కల్పించే జైన ధర్మ ఆచరణలో తనకు ఎవ్వరూ సాటిరారని తెలుగు కంద పద్యంలో శిలాశాసన అక్షరాలతో లిఖింపజేసుకొన్న, జినవల్లనుడు, దేశిగ గణానికి చెందిన జయంగొండ సిద్ధాంతదేవుని శిష్యుడు. వృషభగిరి, కరీంనగర్ కుర్క్యాల సమీపంలో వున్న బొమ్మలగుట్టగా చరిత్రకారులు గుర్తించారు. జైన మత తొలి తీర్థంకరుడైన ఋషభుని కుమారుడైన బాహుబలి, బోధన్ రాజధానిగా పాలించిన ఆధారాలుగా జైన మతానశేషాలు, మహోజ్వలంగా వెలిగిన ఆ మత సంప్రదాయాన్ని చాటి చెప్తున్నాయి. బోధన్‌లో సుమారు 525 విల్లుల ఎతె్తైన బాహుబలి విగ్రహం శ్రాణబెల్గోలో వున్న గోమటేశ్వరుని పోలికలో వుండేదని శాసనాధారం స్పష్టం చేస్తోంది. జెఎఫ్.్ఫట్, మల్లంపల్లి, భావరాజు, డి.ఎల్. నేలటూరి, గోవిందపాయ్, శ్రీపాద, బి.ఎన్.ఎల్., కొల్లూరు, బి.ఎన్., చిలుకూరి, పరబ్రహ్మ శాస్ర్తీ వంటి పురాశాస్త్ర పండిత, పరిశోధక మేధావులు ఎందరో తెలంగాణ సీమ తెలుగు భాషా వైభవాన్ని, వివిధ చారిత్రక ఘట్టాల పరిణామాలలో పరిశోధనా వ్యాసాలతో, పుస్తకాలతో వెలుగులోకి తెచ్చారు. ఇటీవల కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం మల్లారంలో 24వ జైన తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుని అద్భుత కళారూపాన్ని సంస్కృతం, తెలుగు శాసన శిలా ఫలకాన్ని ప్రముఖ చారిత్రక పురావస్తు మేధావి డా.ద్యావనపల్లి సత్యనారాయణ ఇప్పటివరకు అది ఆఖరి జైన దేవాలయంగా ప్రకాశమానం చేశారు. ప్రపంచ స్థాయి తెలుగు మహాసభలకు నడుంకట్టిన నవ్య ప్రభుత్వం, చీకటి కోణాలలో నిక్షిప్తమై, ఇంకా తెలుగు భాష, తెలంగాణ సంస్కృతి సంబంధిత ప్రాచ్య తాళపత్ర సాహితీ సంపద, పురాతత్వ శిలాశాసనాలపై విస్తృతంగా వెలుగు ప్రసరింపజేయటంపై మహాసభా వేదిక, శుభారంభంగా దృష్టి సారించాలి.
*

-జయసూర్య 9440664610