Others

కొంపముంచిన సెల్ఫీ (వార్తావాఖ్య )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరభక్షక క్రూర మృగాలతోను ఘోర భయోత్పాదక జలపాతాలు, కీకారణ్యాలలోను సెల్ఫీలు తీసుకోవడం ఓ అందాల సాహస క్రీడ అయిపోయిన ఈ రోజుల్లో విశ్వ‘సుంద’రాంగనలు- చెంప చెంపా ఆనించుకొని ‘సెల్ఫీ’ దిగి దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లోను, ఫేస్‌బుక్‌లోను ఎక్కించి మురిసిపోయి ఆనక పీకలమీదకు తెచ్చుకున్నారు- మిస్ యూనివర్స్ అందాల పోటీల ఉత్సవ ప్రాంగణంలో పోయినె్నల- ఇరాక్ అందాల రాణి మిస్ సారా ఇదాన్, ఇజ్రాయిల్ అందాల రాణి మిస్ ఆదార్ గేన్ దోల్స్ మ్యాన్‌లు ఇద్దరూ దోస్తీ కట్టారు. మొహాలు దగ్గర చేసుకొని సెల్ఫీలు మక్కువగా దిగారు. దిగిన సెల్ఫే మీద పాపం! అశ్లీల పదాలేమీ రాయలేదు. ‘లవ్ అండ్ పీస్’ అని రాసి ఇన్‌స్ట్రాగ్రామ్‌లోకి, ఫేస్‌బుక్‌లోకి సరదాగా గొప్పగా ఎక్కించారు. పోయినె్నల సంగతి ఇది. మన అమ్మాయి మానుషి జెండా ఎగరేసింది అక్కడేగా! కాని పాపం, ఇజ్రెయిల్ ఇరాక్‌లమధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న సంగతి మరిచి మురిసిన ఈ భామల శాంతి సందేశం- ఇరాక్‌లో ఈవారం కోపాగ్ని భగ్గున రగిలేలాగా చేసింది. పైగా ఈ పిల్ల సారా ఇదాన్ బికినీ అందాలూ ఓ పటికలో ఆరేసుకుంది. చంపుతామన్నారు. దౌత్య సంబంధాలు సాంఘిక అనుబంధాలు లేని రెండు దేశాలమధ్య చెంపలు రాసుకుంటే చెకుముకిరాళ్ళు రాసుకున్నట్లు రాసుకున్నారు మరి అగ్గి పుట్టదా? పుట్టింది- సార కుటుంబం మొత్తాన్ని చంపేస్తాం అన్నారు ఇరాక్ యువకులు- పెద్దలు. ముందా బొమ్మని తీసెయ్యండి- అప్పాలజీ కొట్టండి- అంటే పాపం! ఈ శార కుటుంబం అంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కుమారి ఆదార్ వాళ్ళ ఇజ్రెల్ దేశం ఒక టీవీలో చెప్పింది- మా ఫ్రెండు నేను రాజకీయాలెరుగం- ఏదో అంతర్జాతీయ ప్రేమశాంతికి అనుకొని- శాంతి పావురాళ్లలాగా కువ కువలు పోయాం. ‘‘మా ఫ్రెండుకిచ్చిన మిస్ ఇరాక్ అవార్డుని లాక్కుంటాం. దేశానికి రా లొంగిపో, చెంపలేసుకో అంటున్నారు ఇరాకీయులు’’ అని వాపోయింది న్యూయార్క్ పత్రికతో టైమ్స్‌తో ఇజ్రేలీ అందాల రాణి. ప్రేమే నేరవౌనా? అంటూ విలపిస్తున్న (కన్నీళ్ళు లేవనుకోండి) ఈ అందాల రాణుల బాసటగా ఎవరూ రాస్తారోకోలు చెయ్యరా? పోనీ సెల్ఫీలు పోస్ట్ చేయండి!

-వీరాజీ