Others

స్కూలు ఖాళీ - టీచర్లు ఫుల్! (వార్తావాఖ్య )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో గ్రామాల్లో బడులలో పిల్లకాయలుంటారు. టీచర్లు వున్నా స్కూలుకి రారు. కాని న్యూజీలాండ్ ఉత్తర దిక్కున వయారపో ప్రాంతంలో తుతురుమిరి అనే గొర్రెల క్షేత్రంలోని చిన్న అందాల ప్రైమరీ స్కూలు వున్నది. దానికి లోపల ఒక లైబ్రరీ, వెలుపల స్విమ్మింగ్ పూల్ కూడా వున్నాయి. తలుపులు తెరిచే వుంటాయి. ముచ్చటగా ముగ్గురు టీచర్లు సైతమ్ వున్నారు. కాని ఒక్క స్టూడెంటు కూడా ఉండరు. అక్కణ్ణుంచి గొర్రెల క్షేత్రం దూరంగా ......... కార్మికులంతా మకాం మొరెంబర్రో దగ్గరి క్షేత్రం దరికి పిల్లా మేకా గొర్రెతో సహా ఎత్తేశారు. మొన్నటిదాకా ఇరవై ఇద్దరు బాలలు వుండేవారు- బల్లలనిండా. న్యూజీలాండ్‌లో ఐదో ఏట పిల్లలకి అక్షరాభ్యాసం చేసి బళ్ళో వెయ్యాలి. అది రూలు. కాని ఈ స్కూలు ఇపుడు పొట్ట తిప్పలకి దూరం కాగా - పేరెంట్స్ పనిచోటుకి వెళ్లిపోయారు. స్కూలు ముయ్యం అన్నాడు ట్రస్టీ బోర్డు చైయిర్మన్- మైక్ ఫిరతీగారు- సేవింగ్ బ్యాంక్‌లో ..... పంతుళ్లకి జీతాలు ఖచ్చితంగా ఇస్తాం- కొత్త ఏడాది మూడు నెలలు తలుపులు తెరిచి ఉంచుతాం- ఒక్కడూ రాడూ? మేమే ఓ బస్సు కొంటాం- ముప్పై ఐదు కిలమీటర్ల పరిధిలో గల పిల్లకాయల్ని తెచ్చి మరీ పాఠాలు చెపుతాం ఆటలు ఆడిస్తాం.. అన్నారు మైక్ ఫిరత్‌గారు. ఎంత ఆదర్శం? ఎంత వితరణ? జయహో!