AADIVAVRAM - Others

ప్రపంచయానమే మా అభిరుచి (లోకం పోకడ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిహ్వకో రుచి... మెదడుకో అభిరుచి అన్నారు పెద్దలు. వేర్వేరు వ్యక్తులు వేర్వేరు రుచులను ఎలా ఆస్వాదిస్తారో అలాగే వేర్వేరు వ్యక్తులు వేర్వేరు అభిరుచులను ఆస్వాదించడానికి ఇష్టపడతారు. కేరళలోని కోచికి చెందిన విజయన్ అనే అరవై అయిదేళ్ల వృద్ధుడు కూడా తన అభిరుచితో అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నాడు. చిన్నపాటి టీస్టాల్ నడుపుకునే విజయన్‌కి ప్రపంచమంతా చుట్టేయాలన్న గొప్ప తపన. ఇందుకు అతను ఎంత కష్టమైనా భరిస్తాడు. ఎంత ఖర్చయినా వెనుకాడడు. భర్తతోటిదే లోకమనుకునే అతని భార్య మోహన కూడా అతని అభిరుచికి అనుగుణంగా వ్యహరిస్తూ చేదోడు వాదోడుగా నిలుస్తుంది. వాళ్లిద్దరూ కలసి ఇప్పటి వరకు ప్రపంచంలోని పదహారు దేశాలు చుట్టి వచ్చారంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. బ్రిటన్, స్విట్జర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, యుఎఇ, ఆస్ట్రియా, ఈజిప్టు, సౌతాఫ్రికాతో పాటు మరెన్నో దేశాలు ప్రయాణించారు. విజయన్‌కి దేశాలు చుట్టి రావాలన్న ఆసక్తి అతని తండ్రి వల్ల అబ్బింది. విజయన్‌కి ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు అతని తండ్రి ఎక్కువగా టూర్లు వెళుతూ ఉండేవాడు. అక్కడి దేవాలయాలు చూసి రావడం అతనికి ఆసక్తిగా ఉండేది. అలా తండ్రితో విజయన్ ఆరేళ్ల వయసులో మధురై, పళిని వంటి చోట్ల గల దేవాలయాలను సందర్శించి వచ్చాడు. ఆ అభిరుచి అతను పెరిగి వాడయ్యే సరికి దేశాలు, ఖండాలను చూసి రావాలన్న స్థాయికి చేరుకుంది. ఇలా తాను, తన భర్త టూర్లకు విదేశాలకు వెళ్లడం గురించి విజయన్ భార్య మాట్లాడుతూ తాము విదేశాలకు వెళ్లి రావడం ఎంతో ఉత్సాహంగా ఉంటుందని, తమ మొదటి విదేశీ టూర్ స్విట్జర్లాండ్ అంటుంది. అలాగే ఇజ్రాయెల్‌లోని జీసస్ ప్రతిమను చూసి రావడం ఎంతో గొప్ప అనుభూతి అంటుంది. తమకున్న టీస్టాల్ ద్వారా వచ్చే దానిలో ఎలా లేదన్నా రోజుకు మూడు వందలు వెనకేసి దానిని దేశాలు చుట్టి రావడానికి దాచుకుంటూ ఉంటారు ఆ భార్యాభర్తలు. అలాగే ఒక్కోసారి బ్యాంకుల నుండి లోన్లు కూడా తీసుకుంటారు. ఆ లోన్లను కష్టపడి వడ్డీతో పాటు చెల్లిస్తూ ఉంటారు. కొత్తకొత్త ప్రదేశాలు చూసి రావడం అంటే ఇష్టపడే విజయన్ తన భార్య సహకారం లేకపోతే తానిలా దేశవిదేశాలు చూసి రావడం సాధ్యమయ్యేది కాదని అంటాడు. ముదిమి వయసులో ఇలా దూరతీరాలకు ప్రయాణాలు చేస్తూ, తమకొచ్చే కొద్దిపాటి ఆదాయాన్ని ప్రయాణాలకు ఖర్చు చేస్తూ ఆనందించే ఆ భార్యాభర్తలు త్వరలోనే యునైటెడ్ స్టేట్స్‌కి వెళ్లేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నారు.

- దుర్గాప్రసాద్ సర్కార్