Others

కారణంతోనే కార్యమూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ బోయవాడే ధర్మవ్యాధుడు. ఆ ధర్మవ్యాధుని దగ్గరకు వచ్చిన కౌశికుడు పరధర్మాన్ని ఆశ్రయంచిన ధర్మవ్యాధుని పూర్వజన్మ .... గురించి ఆలోచిస్తూ
ఆ ధర్మవ్యాధా! నీకిన్ని ధర్మాలు తెలిసినప్పటికినీ, ధర్మసూక్ష్మ గ్రహణ ఉన్నప్పటికీ కూడా నీవు మాంస విక్రయం చేయడం నేరం కదా. పైగా నేను అడవిలో ముక్కుమూసుకొని కూర్చుని ఏకాగ్ర చిత్తుడినై ఉండగా నాపై కొంగ రెట్టవేసింది. నేను ఆ కొంగను కోపంతో చూడగా అది చనిపోయింది.
ఆ విషయం ఆ వనితా రత్నానికి ఎలా తెలిసింది? ఆమె పంపగా నేను మీ దగ్గరకు వస్తే నేను ఏమీ చెప్పకముందే మీకు నా గురించిన సమాచారం ఎలా తెలసింది? అనిఅంటూకౌశికులు ఆశ్చర్యపోయాడు.
తాను ఈ మాంసాన్ని విక్రయించే ధర్మం ఎందుకు పాటించవలసి వచ్చింది అని అడిగిన కౌశికునకు తన పూర్వజన్మ గురించి వివరాలను ధర్మవ్యాధుడు ఇలా చెప్పాడు.
చిన్నగా నవ్వుతూ ‘అయ్యా! కౌశికమహర్షీ! ముందు మీరు మా ఇంటికి రండి. నేను నా కర్తవ్యనిర్వహణలో మీకు సరిగా ఆతిథ్యం ఇవ్వలేకపోయాను. ఇపుడు మీరు మా ఇంటికి రండి మీకు కావాల్సిన సమాచారం అక్కడే దొరుకుతుంది’ అన్నాడు ధర్మవ్యాథుడు.
అమిత ఆశ్చర్యమానసుడైన కౌశికుడు తన మనస్సులో ఇనే్నళ్లు తపస్సు చేసి బ్రహ్మచర్యాన్ని అవలంబించి నేను సాధించిన ఈ తపశ్శక్తికన్నా వీరింటిలో ఉన్న శక్తి గొప్పదా అది ఏమిటి దాన్ని తెలుసుకోవలసిన అగత్యం తప్పకుండా ఉంది అనుకొన్నాడు.
వెంటనే వారిరువురు కలసి ధర్మవ్యాధుని ఇంటికి వెళ్లారు. ఇంటిలోపలికి వెళ్లిన కౌశికునికి పార్వతీ పరమేశ్వరులే ఇక్కడ ఆసీనులై ఉన్నారా అన్నంత అనుభూతి కలిగింది. కౌశికుడు అనుకోకుండానే వారికి చేతులెత్తి నమస్కారం చేశాడు. ధర్మవ్యాధుడు. ‘అమ్మా వీరు మహా తపశ్శాలులు, కౌశిక నామధేయులు. వీరిని మీరు చూస్తారని మనింటికి ఆహ్వానించాను’ అంటూ కౌశికుని పరిచయం చేశాడు తన తల్లిదండ్రులకు ధర్మవ్యాథుడు. వారు ఎంతో ఆనందంగా కౌశికుణ్ణి ఆహ్వానించారు. దగ్గరగా వచ్చి కూర్చోమని చెప్పారు.
‘అమ్మా మీకు ఏదైనా కొరతగా ఉన్నదా. ఇపుడు మీకు ఏమి కావాలో చెప్పండి’ అని అడుగుతున్న ధర్మవ్యాధునితో వారు మాట్లాడకముందే
కౌశికుడు ‘అమ్మా నేను మీతో మాట్లాడవచ్చా’ అని అడిగాడు.
ఇపుడు మీరే ఆదిదంపతుల వలె కనిపిస్తున్నారు. ఒకవేళ భగవంతుడే వచ్చి మిమ్ము ఏదైనా వరం కోరుకోమంటే ఏమనికోరుతారు అని అడిగాడు కౌశికుడు. ‘ఏముంది నాయనా! మరుజన్మలోను ఈ పుత్రుడే మాకు పుట్టాలని వీని సన్నిధిలోనే మా కాలం తీరిపోవాలని కోరుకుంటాము’ అని ఏకకంఠంతో వారు చెప్పారు. వారి మాటలకు మరింత విస్మయపడిన కౌశికుడు దీనికంతా కారణమేమిటో పరధర్మాన్ని ఆశ్రయించి ఈ జన్మ వచ్చిందన్నావు కదా అసలు నీ పూర్వజన్మమేదో నాకు విశిదపర్చు అని మళ్లీ కౌశికుడు అడిగాడు. అపుడు తన పూర్వజన్మగురించి ధర్మవ్యాధుడు ఇలా చెబుతున్నాడు. మీరు చేయనిది నేను చేసినది ఒక్కటే. అదే మాతాపిత సేవ.
మీరు మీ విధి నిర్వహణ చేయక కర్తవ్యాన్ని విడిచి తపస్సు చేసుకోవాలని అడవికి వెళ్లారు. మీ వల్ల ఉద్ధరింపబడవలసిన మీ మాతపితులు ఎన్నో అవస్థలపాలైయ్యారు.
- ఇంకా ఉంది

- డా. రాయసం లక్ష్మి