Others

విధిని ఎదిరించి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె ఓ మోడల్. అందరి వలే అందంగా..ఆనందంగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఆరోజు చీకటి ఛాయలు అలుముకున్నాయి. టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనే డిసీజ్ ఆమెను కబలించింది. అమెరికాలో లక్షమందిలో ఒకరికి వచ్చే ఈ అరుదైన వ్యాధి బాక్టీరియా ఆమెలోకి టాంపోన్ల రూపంలో ప్రవేశించి వైకల్యాన్ని మిగిల్చింది. కాలులేకపోయినప్పటికీ అధైర్యపడకుండా శక్తినంతటిని కూడగట్టుకుని బతుకుతుంది. ఆమే లారెన్ వెస్సెర్. 2012నాటికి మోడల్‌గా లారెన్ రాణిస్తోంది. ఓ రోజు షాపింగ్‌కు వెళ్లింది. టాంపోన్స్ కొనుగోలు చేసింది. అక్కడ నుంచి ఆనందంగా ఇంటికి వచ్చింది. సాయంత్రానికి ఒక్కసారిగా జ్వరం ముంచుకువచ్చింది. అదీ 107 ఫారిన్‌హీట్‌తో ఒళ్లు భగభగ మండిపోయింది. వెనువెంటనే గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లిపోయింది. అదృష్టవశాత్తు వైద్యులు మెరుగైన వైద్యం అందించి టాంపోన్లు తొలగించి బాక్టీరియాను సైతం తొలగించి ప్రాణాన్ని కాపాడారు. కాని అప్పటికే జరగరాని నష్టం జరిగింది. కుడి కాలు మొద్దుబారిపోయి తరువాత తొలగించాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఈ అందమైన మోడల్ ‘ టాక్సిక్ షాక్ సిండ్రోమ్’తో బాధపడుతూనే ఉంది. ఇపుడు ఎడమ కాలికి సైతం పుండు ఏర్పడింది. దీనివల్ల ఈ కాలును కూడా తొలగించాలని వైద్యులు చెబుతున్నారు. ‘‘నేనేమి చేయగలను. నిమిత్తమాత్రురాలిని. విధివంచితురాలిని’’ అని అంటూనే తనలోని కాని ధైర్యాన్ని మాత్రం సడలిపోనివ్వలేదు. నావలే అమ్మాయిలు ఈ వ్యాధి బారిన పడకూడదని ఈ టాంపోన్లు వాడవద్దని అమెరికాలో ఆమె విస్తత్ర ప్రచారం చేస్తోంది. పాఠశాలలకు వెళ్లి తన వైకల్యాన్ని చూపిస్తూ బాలికలను సైతం చైతన్యపరుస్తోంది. ఏటికి ఎదురీదుతూ లారెన్ వెస్సర్ ముందుకు సాగుతుంది.
టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
ఇది అరుదైన వైద్య సమస్య. ఓ వ్యక్తి స్ట్ఫెలోకాకస్ ఆరియస్ (స్ట్ఫా) బాక్టీరియాకు గురైనప్పుడు సంభవిస్తోంది.
ఈ వ్యాధి ప్రారంభ దశలో అధిక జ్వరం, రక్తపోటు వస్తోంది. శరీరం మీద దద్దుర్లు వస్తాయి.
ఈ లక్షణాలను గుర్తించినట్లయితే టాంపోన్లు తొలగించి చికిత్స ఆరంభించాలి.
చికిత్స ఆలస్యం అయితే కోమాలోకి వెళ్లిపోతారు. అవయవాలను కుంగదీస్తోంది.
నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజ్ సంస్థ లెక్కల ప్రకారం అమెరికాలో లక్ష మందిలో ఒక్కరికి మాత్రమే వస్తుంది. ఆ ఒక్కరే లారెన్ వెస్సర్.