Others

తల్లిదండ్రులే దైవం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్మనిచ్చిన తల్లిదండ్రులు సాక్షాత్తు దైవస్వరూపులు. వారికి సర్వత్రా కృతజ్ఞతాభావంతో ఉండాలి. వృద్ధాప్యంలో తమ పిల్లలు పట్టించుకోవడంలేదని, నిర్లక్ష్యంగా చిన్నచూపు చూస్తున్నారని చాలామంది అనాథ వృద్ధ శరణాలయాలలో కుంగిపోతుంటారు. అయితే సంస్కారవంతులు ఎవరైనా తల్లిదండ్రులను చిన్నచూపు చూడరు. సంస్కార హీనులయితేనే కన్నవారిని ఇబ్బందికి గురిచేస్తారు. త్యాగానికి ప్రతిరూపాలు అమ్మా, నాన్నలు. వృద్ధాప్యంలో వారికి అండగా నిలవాలి. బాధ్యత నుండి తప్పుకోకుండా కన్నవారిని కన్నబిడ్డల్లా చూసుకోవాలి. కాని నేటి యువతలో వికృతచేష్టలు.. వెర్రితలలు తిష్టవేయడంతో తల్లిదండ్రులపట్ల ప్రేమానురాగాలు మృగ్యమైపోతున్నాయి. అక్కడక్కడా ఇంకా కొందరు తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు కాబట్టి, ఇంకా మానవ సంబంధాల మధురిమలు మిగిలే ఉన్నాయి. వాటిని మనం నిరంతరం కాపాడుకోవాలి. ప్రేమ, గౌరవం అనేవి ఒకరిస్తే వచ్చేవి కావు. మన మంచితనంతో మేనమే సంపాదించుకోవాలి. చిన్నప్పటినుండి తల్లిదండ్రులు, పిల్లలకు సత్‌ప్రవర్తన, సభ్యత సంస్కారం నేర్పించి మానవీయ విలువలను వారికి బోధించాలి. పెద్దవాళ్ళను గౌరవించడం, ప్రేమించడం నేర్పి, మనిషికి మనిషికి మధ్య అంతరాలు పెంచకుండా చూడాలి. కన్నవారు జీవించినంతకాలం కంటతడి పెట్టే పరిస్థితి కల్పించకూడదు. మనకు జీవితాంతం వారిచ్చిన భిక్షేనని మరువవద్దు. వారి ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మ సరిపోదు. తల్లిదండ్రులను పూజ్యనీయులుగా చూడలేనివారు దైవారాధన చేయడం శుద్ధ దండగ. ఎప్పుడూ మనం అనుభవిస్తున్న సిరిసంపదలు వారి పుణ్యఫలాలేనని గుర్తుంచుకోవాలి. అందుకు వారిని అభిమానించాలి.. ఆదరించాలి. అప్పుడే జీవితానికి అర్థం, పరమార్థం.

-కాయల నాగేంద్ర