Others

మాజీ మోడల్ వింత కోరిక! (వార్తావాఖ్య )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్ కెంట్‌కి చెందిన బ్రిస్టల్‌లో నివసించే అందాల మాజీ మోడల్ డెబ్రా పార్సన్ (41)కి తల్లి శ్రీమతి డోరీన్ బ్రౌన్ అంటే ప్రాణం. ముఖ్యంగా 1996లో తనకి మృతశిశువు జన్మించడంతో తల్లికి మరీ చేరువైపోయిందామె. దురదృష్టవశాత్తు మొన్న మేలో చనిపోయింది అమ్మ. డెబ్రా దుఃఖంతో వెర్రెత్తిపోయింది. అంత్యక్రియల అనంతరం తల్లి చితాభస్మాన్ని మక్కువగా తీసుకుని భద్రపరచుకుంది. తనతో కూడా ఒక చిన్ని సంచీలో పెట్టుకు తిరిగేది. సంప్రదాయం ప్రకారం ఆమె సోదరీమణులు ఇద్దరూ తమ వంతు తల్లి చితాభస్మాన్ని- ఆమెకి అత్యంత ప్రియమైన చోట వెదజల్లేశారు. డెబ్రా మాత్రం అమ్మ లేనిదే నేను బ్రతకలేను అన్నది. ఒక రోజు తల్లి చితాభస్మాన్ని తన బొడ్డున పెట్టుకున్న చిన్న సంచీలోనుంచి ఇలా వేలితో తీసి నాకింది- చప్పరించింది. కసగా వగరుగా వుంది. నువ్వు నా కడుపులో వుండాలమ్మా అంటూ ఎప్పుడయినా ఓసారి కాస్త చితాభస్మాన్ని మ్రింగుతూ వచ్చింది. అమ్మ నాలో ఉంది. నేను పీల్చే గాలి ఆమెకి ఊపిరి అనేది. మొన్న క్రిస్మస్‌నాడు డిన్నర్‌లో కోడి వంటకంమీద మిరియం ఉప్పు జల్లుకున్నట్లు డేరీన్ బ్రౌనమ్మగారి చితాభస్మ సంచీ తీసి మొత్తం విప్పేసి తిండిమీద జల్లేసుకుంది. ఈ కోరిక నాలో దిన దిన ప్రవర్థమానమయిపోతున్నది. ఇక ఎవరేమనుక్ను డోంట్ కేర్- అంటూ తల్లిని మ్రింగి బ్రేవ్‌మని త్రేన్చింది. బంధువర్గం ఈ ప్రేమకి ముక్కున వ్రేలేసుకుని ఊరుకున్నారు.

-వీరాజీ