Others

వలపుల వలలో పడ్డ గజదొంగ! (వార్తావాఖ్య )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా స్టార్ల మోజు దొంగలకి కూడా వుంటుంది. బిహార్‌లో పాట్నాకి నూట యాభై కిలోమీటర్ల దూరంలోని దర్భంగాకి చెందిన గ్యాంగ్‌మాస్టర్‌గా వాసికెక్కిన దొంగ మహమ్మద్ హస్సేన్ అంటే చాలామందికి హడల్- అతగాడు ఘనత వహించిన భాజపా ఎంఎల్‌ఏ శ్రీమాన్ సంజయ్ కుమార్ మహతోగారి చాలా ఖరీదైన స్మార్ట్‌మొబైల్‌ని ఇంకా స్మార్ట్‌గా కొట్టేసి ఇంచక్కా వాడుకోవడం మొదలెట్టేడు. కాని దర్భంగా పోలీసు ఠానాలో మరీ అందమైన పేరు కూడా వున్న ఓ పోలీసు అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ మధుబాలాదేవి ముందుకొచ్చింది. సాహసివి మహిళా! మహమ్మద్‌ని శ్రీ మహతోగారి మొబైల్‌తో సహా పట్టుకోవాలి అన్నారు. ఆ ఫోన్ డేటాని ట్రేస్ చేసింది మధుబాల. ‘‘నేను నీకు అభిమానిని, నువ్వు నా హీరో (్ఫన్లో)’’ అంటూ మాట కలిపింది.. సందేశ మధురిమలు చిలకరించింది. జగాన ఆడదాని కొంగు తాకితే బోల్తాకొట్టని వాడెవడు? అతనికి అలా గాళ్‌ఫ్రెండ్ అయింది. పేరా? అని అడిగితే.. పోల్చలేదా? ప్రీతం! .. నేనే నయనతారను- అంటూ కువకువలు పోయింది. వాడు ఈ దక్షిణాది సూపర్ లేడీ స్టార్ అంటేనే చెవి కోసుకుంటాడు. ఇపుడు ముక్కు కోసుకోవడానికి రెడీ అయ్యాడు. ‘్ఫటో పెట్టవా? నాకు నమ్మకం వచ్చుద్ది’ - నయనతార బొమ్మని అప్‌లోడ్ చేసింది మధుబాల. ఎక్కడ కలుద్దాము డియర్ అంటూ మెస్సేజ్ కొట్టింది. వాడు బోల్తాకొట్టాడు. సెంటు కొట్టుకుని మరీ రంగంలో దిగాడు- మధుబాల మేలిముసుగు ధరించింది. మహమ్మద్ హుస్సేన్ దరహాస వికసిత వదనంతో ముందుకొచ్చాడు- వెనకనుంచి మఫ్టీలో పోలీసులు - డ్యూయెట్ సాంగ్‌లో ‘వంతగాళ్ళలాగా’ వచ్చారు. అమ్మడు హుష్‌కాకీ అయింది. అయ్య వలపుల సంకెళ్ళకి బదులు ఇనుప బేడీలు వేయించుకున్నాడు. వాడు చూసింది నయనతారబొమ్మ కనుక మధుబాలకి భవిష్యత్తులో ప్రమాదం రాదు- పైగా ప్రమోషన్ ఖాయం- ఈ దొంగ ‘మోస్ట్ వాంటెడ్’ అన్నారు విజ్ఞులు.