Others

జ్ఞాపకశక్తిని పెంచుకోండి ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంత వయసు వచ్చిన తరువాత జ్ఞాపకశక్తి తగ్గటం అనేది సహజం. కొన్ని విషయాలను క్రమేపి మర్చిపోతుంటాం. విషాద సంఘటనలను మర్చిపోతే ఫరవాలేదు. కాని దైనందిన జీవితంలో చేయాల్సిన పనులను కూడా మర్చిపోయే పరిస్థితి ఉత్పన్నమైతే? దానిని తీవ్రమైన సమస్యి గుర్తించి చికిత్స తీసుకోవటం మేలు. తీవ్రమైన మతిమరుపుతో బాధపడే పరిస్థితిని అల్జీమర్స్ వ్యాధిగా పరిగణిస్తారు. దీనిని నివారించుకోవాలంటే చిన్నతనం నుంచే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి.
ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
ఆకుకూరలు, బ్రొకోలీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు మతిమరుపును నివారించడంలో ఉపకరిస్తాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంపొందింపజేస్తాయి. ఆకుకూరలతో పాటు మొలకెత్తిన విత్తనాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇవి మెదడుకు కావలసిన శక్తిని ఇవ్వడమే కాకుండా, విటమిన్స్, మినరల్స్ మొదలైనవి అధికంగా ఉండటంతో శారీరక ఆరోగ్య రక్షణకు ఉపకరిస్తాయి. వీటిని తీసుకోవటం వల్ల జ్ఞాపకశక్తి సమర్థవంతంగా ఉంటుందని వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది. అలాగే బెర్రీ పండ్లు సైతం జ్ఞాపకశక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. వీటిలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. విటమిన్లు ఉండటం వల్ల మెదడు కణాలను, రక్తనాళాలను ప్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి.