Others

ద్రౌపది మహిళలకు మార్గదర్శా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాభారత యుద్ధానికి ద్రౌపది కారణం అంటూ కొంతమంది చేస్తున్న వాదనల్లో వాస్తవం లేదు. ఇది కేవలం అపవాదు మాత్రమే. కురువంశపు కోడలుగా కురురాజ్యం మహాసభలో అతిరథులు కొలువుదీరిన సభలో ఒక స్ర్తి అవమానానికి గురికావడం దురహంకార పురుషాధిక్యాన్ని, అన్యాయాన్ని అడ్డుకోలేని వీరత్వ శూన్యతకు బుద్ధి చెప్పడమే ద్రౌపది ముందున్న ఏకైక లక్ష్యం. తనకు జరిగిన అవమానం భవిష్యత్తులో ఏ స్ర్తికి కూడా జరగకూడదని పురుష దురహంకారానికి తగిన బుద్ధిచెప్పాలని ఆనాటి తన భర్తలను ప్రోత్సహిస్తూ, శ్రీకృష్ణుడి ద్వారా దైవీశక్తిని పొందుతూ మహాభారత సంగ్రామానికి బీజంవేసి స్ర్తి శక్తి సామార్థ్యాలను స్ర్తిజాతికి పంచిన మహాసాధ్వీ ద్రౌపది.
మహాభారత పురణాలలో ద్రౌపదే మొట్టమొదటి ఫెమినిస్ట్‌అని ప్రఖ్యాత శాస్ర్తియ నృత్యకారిణి సోనాల్ మాన్‌సింగ్ సైతం సమర్థిస్తున్నారు. తన భర్తలతో పాటు పరాక్రమ యోధులని చెప్పబడే బీష్మపితామహుడు, ఆచార్య ద్రోణుడు, విదురుడు, కర్ణుడు మొదలైనవారు కొలువుతీరిన నిండు సభలో తన మానాభిమానాలను రక్షించుకునేందుకు ద్రౌపది దైవానే్న నమ్ముకుంది. యదుకుల కృష్ణుణ్ణి తనను రక్షించవలసినదిగా ప్రార్థించింది.
సమాజంలో మానవత్వం మంటకలిసిపోతున్న సమయంలో ఆ దైవత్యమే ఆమెను కాపాడింది. ఆపద ఎదురైన ప్రతి సందర్భంలోనూ ద్రౌపది దైవానే్న విశ్వసించింది. అభిమన్యుని మరణ సమయంలోనూ, ఉప పాండవుల మరణం విషయంలోనూ ద్రౌపది ఆ కృష్ణపరమాత్ముని ద్వారా విధి నిర్ణయాన్ని గుర్తించి ఉపశమనం పొందింది. అశ్విద్ధామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ద్వారా అభిమన్యుని భార్య శశిరేఖ - ఉత్తర గర్భం విచ్ఛిన్నం కాకుండా శ్రీకృష్ణుని దైవత్వంతో కాపాడుకుని కురువంశాన్ని అంతరించకుండా పరిరక్షించిన కురుసామ్రాగ్ని ద్రౌపది. అందుకే మహిళలకు ద్రౌపది ప్రతినిధి అంటూ ప్రముఖ రచయిత్రి అనితా నాయర్ అంటారు. ఆనాటి కాలంలోనే ద్రౌపది సర్వ స్వతంత్రురాలైన విషయాన్ని గుర్తించాలి. అలా సర్వస్వతంత్రంగా మహిళలు అన్ని రంగాలలో ఆధిపత్యం, గౌరవాన్ని పొందాలంటే ద్రౌపది అనుసరించిన మార్గం నేటి మహిళకు ఆదర్శం కావాలి.

-బలుసా జగతయ్య